Beggars Misuse Money Scam: వాళ్లంతా బిచ్చగాళ్ళు. అయిన వాళ్ళు లేక.. ఉండడానికి ఆవాసం లేక.. తినడానికి తిండి లేక.. బతికే మార్గం లేక యాచిస్తూ బతుకుతున్నారు. వారిలో కొంతమంది యువకులున్నారు. కాకపోతే కొన్ని సమస్యలున్నాయి. వారి కంటూ ఎవరూ లేరు కాబట్టి.. ఆ ఇబ్బందులతోనే వారు బతుకుతున్నారు. దయగల మహాప్రభువులు ఎవరైనా భిక్షం వేస్తే తింటున్నారు. లేకుంటే కడుపు మాడ్చుకొని ఉంటున్నారు.
Also Read: కన్న కొడుకును బస్టాండ్ లో వదిలేసి..ఇన్ స్టా ప్రియుడితో తల్లి వెళ్లిపోయిన ఘటనలో సంచలనం!
అటువంటి బిచ్చగాళ్లకు కొంతకాలంగా సికింద్రాబాద్ ప్రాంతంలో కొంతమంది బీరు తాగిస్తున్నారు. బిర్యాని తినిపిస్తున్నారు. అదే సమయంలో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నారు. ఆ తర్వాత వారి పురుషాంగం నుంచి వీర్యం సేకరిస్తున్నారు. చదువుతుంటేనే ఏవగింపు కలుగుతుంది కదా. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. ఆ బిచ్చగాళ్లకు కేవలం బీరు, బిర్యానీ మాత్రమే పెడుతున్నారు. వారికి అశ్లీల చిత్రాలు చూపించి సేకరించిన వీర్యాన్ని అహ్మదాబాద్ పంపిస్తున్నారు.. ఇటీవల సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత.. మరిన్ని దారుణాలు బయట పడుతున్నాయి.. ముఖ్యంగా సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో ఘోరాతి ఘోరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి.
బిచ్చగాళ్లకు బిర్యాని, మీరు మాత్రమే కాదు.. చదువుకుంటున్న యువకులకు 4000 ఇచ్చి.. వారికి అశ్లీల చిత్రాలు చూపించి వీర్యాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అడ్డా మీద ఉండే మహిళా కూలీలకు రకరకాల ఇంజక్షన్లు ఇచ్చి.. వారి దగ్గర నుంచి అండాలు సేకరిస్తున్నారు. అసలే పేదలు.. ఆపై ఒక్కో అండానికి 25వేల దాకా ఇస్తుండడంతో ఒప్పుకుంటున్నారు. ఈ అండం వాస్తవానికి మహిళల్లో ప్రతి నెల ఒకటి మాత్రమే విడుదలవుతుంది. కృత్రిమ పద్ధతుల వల్ల ఒక మహిళ నుంచి మూడు నుంచి ఆరు వరకు అండాలు సేకరిస్తున్నారు. ఇలా కృత్రిమంగా ఇంజక్షన్లు వేసి అండాలు సేకరించడం వల్ల ఆడవారి ఆరోగ్యం పాడవుతుంది. హార్మోన్ వ్యవస్థ మొత్తం దారి తప్పుతుంది. తద్వారా వారు అనారోగ్యానికి గురవుతారు. ఆ తర్వాత అనేక రోగాల బారిన పడి చనిపోతారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ నిర్వాహకులు.. దర్జాగా తమ దందా సాగిస్తున్నారు.
Also Read: డిప్రెషన్‌లో తెలంగాణ మహిళలు..
బిచ్చగాళ్ళు, యువకుల నుంచి సేకరించిన వీర్యాన్ని అహ్మదాబాద్ పంపిస్తున్నారు. ఆడవారిని సేకరించిన అండాలను కూడా అక్కడికి తరలిస్తున్నారు. పిల్లలు లేని వారికి.. కృత్రిమ పద్ధతిలో ఈ అండాలను, వీర్యాన్ని ప్రజననం జరిపించి పిల్లలను పుట్టిస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వేరే వాళ్ళ దగ్గరనుంచి పిల్లల్ని వేలకు కొనుగోలు చేసి.. లక్షలకు అమ్ముతున్నారు. అయితే ఈ దందా మొత్తం ఒక పెద్ద రాకెట్ అని.. దీని వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.