AP Liquor Scam Latest Update: వెనుకటికి దొరికితేనే దొంగలు.. దొరకకపోతే దొరలు అనే ఒక సామెత ఉండేది. ఆ సామెత ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. కాకపోతే అడ్డంగా దొరికినప్పటికీ.. దొంగలు తాము ఆ దొంగతనం చేయలేదని చెప్పడమే ఇక్కడ విధి వైచిత్రి.
Also Read: వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..!
హైదరాబాదులోని వ్యవసాయ క్షేత్రంలో 11 కోట్ల నగదు దొరికింది. ఈ నగదు ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిదని ఏపీ పోలీసులు ప్రకటించారు. పైగా ఆ నగదును ఓ సంస్థ పేరుతో స్టికర్ వేసి.. డబ్బాలలో దాచారని పోలీసులు వెల్లడించారు. ఆ నగదు మొత్తాన్ని అత్యంత రహస్యంగా దాచారు. మద్యం వ్యవహారం విషయంలో ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో డబ్బు దాచిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బులు ప్రత్యేకమైన పెట్టెలో భద్రపరిచి దాచారు.
పోలీసులు విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించడంతో హైదరాబాదులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేశారు. తనిఖీలలో 11 కోట్ల నగదు లభించింది. దీంతో పోలీసులు ప్రత్యేక యంత్రాల సహాయంతో ఆ నగదును లెక్కించారు. ఆ తర్వాత ఆ నగదును అత్యంత భద్రంగా స్వాధీనం చేసుకున్నారు.. ఈ పరిణామం నేపథ్యంలో.. మద్యం కుంభకోణంలో ఇంకా భారీగా నగదును ఉంచి ఉండవచ్చని.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇక ‘పులివెందుల’ రాజకీయం
11 కోట్ల నగదు విషయంలో రాజ్ కసిరెడ్డి మరో కీలక విషయాన్ని వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ నగదు మొత్తం తనది కాదని.. విజయేందర్ రెడ్డి వ్యక్తికి చెందిందని రాజ్ కసిరెడ్డి పేర్కొనడం విశేషం.. అంతేకాదు ఆ నగదుతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. తనను అనవసరంగా ఇబ్బందికి గురి చేయవద్దని రాజ్ కసిరెడ్డి పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నగదు రాజ్ కసిరెడ్డిది కాకపోతే.. అక్కడ ఆ స్థాయిలో నోట్ల కట్టలు ఉన్నాయని.. కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు చెప్పింది ఎవరు? ఆ నగదు అక్కడ ఉన్న విషయాన్ని అంత స్పష్టంగా చెప్పింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది. ఆ స్థాయిలో నగదు లభించినప్పటికీ రాజ్ కసిరెడ్డి పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం.. ఆ నగదుతో తనకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడం గమనార్హం.