AP Free Bus Scheme Update: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తోంది. అయితే ఈ ఉచిత ప్రయాణం పరిధి ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్రం మొత్తం అవకాశం ఇస్తారా? ఉమ్మడి జిల్లాల వరకు పరిమితం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు మాత్రం ఉమ్మడి జిల్లాల వరకు ఉచిత ప్రయాణం అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అయితే ఒకవైపు అధికారులు సన్నాహాల్లో ఉండగా.. ఈ పథకానికి పేరు ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముద్రించిన జిరో టికెట్ ఫోటో వైరల్ అవుతోంది.
Also Read: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?
* స్త్రీ శక్తి పేరుతో టికెట్..
ఉచిత ప్రయాణానికి( free travelling) సంబంధించి జీరో టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ టిక్కెట్ పై స్త్రీ శక్తి అని రాసి ఉంది. ఆ టికెట్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరుతో పాటుగా డిపో పేరు, స్త్రీ శక్తి, ప్రయాణించే రూట్ వంటి అంశాలను ప్రింట్ చేశారు. ఆ రూట్ లో మొత్తం టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ చెల్లించవలసింది రూ. 0.00 గా ముద్రించారు. ఈ టిక్కెట్ ను చూసిన తర్వాత ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుగా పెట్టినట్లు అంతా భావిస్తున్నారు. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మార్గదర్శకాలు కూడా విడుదల చేసే పనిలో పడింది.
* ఆ రెండింటిలో ఒకటి చూపాలి..
అయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు ఏదైనా ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు( Aadhar card) కానీ.. వాటర్ కార్డు కానీ చూపిస్తే సరిపోతుంది. కొత్త బస్సులు వచ్చేవరకు పాత బస్సులనే ఉచిత ప్రయాణానికి ఉపయోగిస్తారు. బస్సుల టైమింగ్స్, సిబ్బంది బ్యూటీ సమయాల్లో మార్పులు ఉండవు. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని షరతులతో కూడిన ప్రయాణానికి అవకాశం ఇవ్వచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది. నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ తో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ లో సైతం ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు.