AP Cabinet Expansion: మంత్రివర్గంలోకి ఆ మహిళ ఎమ్మెల్సీ?!

AP Cabinet Expansion: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ పై రకరకాల చర్చ నడుస్తోంది. జూనియర్లను తప్పించి సీనియర్లకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విపక్ష వైసిపిని ఎదుర్కోవడంలో మంత్రులు వెనుకంజలో ఉన్నారని సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఓ నలుగురు మంత్రులను తప్పించి.. ఫైర్ బ్రాండ్లను క్యాబినెట్ లోకి తీసుకుంటారని గత కొంతకాలంగా విస్తృతమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. అయితే సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఏదైనా అంశంపై లీకులు ఇచ్చి.. ప్రచారం జరిగేలా చేస్తారు. దానిపై వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సైతం చంద్రబాబు మొగ్గు చూపిన నేపథ్యంలో రకరకాల చర్చ అయితే సాగుతోంది. అయితే ఈసారి శాసనమండలి నుంచి మంత్రివర్గంలోకి ఒకరిద్దరిని తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న.

Also Read: పులివెందులకు ఉప ఎన్నిక.. జగన్ కు అగ్నిపరీక్ష!

అప్పట్లో సీనియర్లు ఇద్దరిని..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). ఆ సమయంలో చంద్రబాబు సీనియర్ నేతలను మంత్రులుగా తీసుకున్నారు. యనమల రామకృష్ణుడు తో పాటు పొంగూరు నారాయణ ఎమ్మెల్సీలుగా ఉండేవారు. వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇద్దరూ సీనియర్ నేతలే. టిడిపి ఆవిర్భావం నుంచి యనమల రామకృష్ణుడు సేవలందిస్తూ వచ్చారు. ఒక్కసారి మాత్రమే స్పీకర్ గా పని చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అవుతూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఉండగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు పార్టీకి విస్తృత సేవలు అందించినందుకు నేరుగా మంత్రివర్గంలోకి నారాయణను తీసుకొచ్చారు. తరువాత ఎమ్మెల్సీ ని చేశారు.

శాసనమండలిని టచ్ చేయని చంద్రబాబు..
అయితే ఈసారి టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చింది. కానీ శాసనమండలి నుంచి ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నా ఆయనను పరిగణలోకి తీసుకోలేదు. మంత్రివర్గం విషయంలో అసలు శాసనమండలిని టచ్ చేయలేదు. అయితే 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకటరమణను మంత్రిని చేశారు జగన్. అయితే కొద్ది కాలానికి ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అప్పట్లో ఎమ్మెల్సీల జోలికి వెళ్లలేదు. ఎమ్మెల్యే లక్కీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా శాసనమండలి జోలికి వెళ్లకుండా క్యాబినెట్ కూర్పును పూర్తి చేశారు. అయితే ఈసారి విస్తరిస్తే మాత్రం శాసనమండలి నుంచి ఒకరిద్దరిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ఏపీలో ఉచిత ‘బస్సు’ ప్రయాణం.. కీలక ప్రకటన

తెరపైకి గ్రీష్మ పేరు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress party) ధీటుగా సమాధానం చెప్పే యువ నేతలకు అవకాశం ఇస్తారని కూడా తెలుస్తోంది. ఆ లెక్కన శాసనమండలిలో కావలి గ్రీష్మ ఉన్నారు. ఆమె సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి కుమార్తె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓ రేంజ్ లో విరుచుకుపడతారు అన్న పేరు ఉంది. గతంలో మహానాడు వేదికగా ఏకంగా తొడ గొట్టి మాట్లాడారు. చంద్రబాబు దృష్టిని ఆకర్షించగలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ సమీకరణలో భాగంగా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే దూకుడుగా వ్యవహరిస్తారని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment