Site icon Desha Disha

AP 10th Exam System Change: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు..!

AP 10th Exam System Change: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు..!

AP 10th Exam System Change: సీపీబీఎస్‌.. ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం అమలులోకి తెచ్చింది. ఏడాదిరి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో ఏది ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగనణలోకి తీసుకుంటారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగానే రాష్ట్రాలు సిలబస్‌ రూపొందిస్తున్నాయి. పాఠ్యాంశాల బోధన, పరీక్షల నిర్వహణ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పరఖ్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఈమేరకు 2026 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల కోసం ప్రశ్నపత్రాల బ్లూ ప్రింట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బ్లూ ప్రింట్‌ విద్యార్థుల సృజనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించేలా రూపొందించబడింది. బట్టీ చదువులకు బదులు.. విద్యార్థుల అవగాహన స్థాయిని మెరుగుపరిచే ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చారు.

Also Read: నెల్లూరుకు జగన్.. పోలీసుల్లో టెన్షన్!

సృజనాత్మక ప్రశ్నలు..
కొత్త మోడల్‌ పేపర్లు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహించేలా రూపొందించబడ్డాయి. ఈ ప్రశ్నలు విద్యార్థులు తమ జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించేలా, సమస్యలను విశ్లేషించి పరిష్కరించేలా ఉంటాయి. సైద్ధాంతిక పాఠాలను వాస్తవ జీవిత సందర్భాలతో అనుసంధానించే ప్రశ్నలు, ఓపెన్‌–ఎండెడ్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఇది విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, నిర్ణయాధికారాన్ని పెంపొందిస్తుంది.

విద్యార్థుల్లో అవగాహన పెంచేలా..
విద్యాశాఖ పేర్కొన్నట్లుగా, ఈ మార్పులు విద్యార్థుల పనితీరు ఆధారిత అవగాహనను పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. సంప్రదాయ పరీక్షా విధానంలో ఎక్కువగా గుర్తుంచుకోవడంపై దృష్టి ఉండగా, కొత్త విధానం విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది. ఈ మార్పులు విద్యార్థులను భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Also Read: సైకిల్ ఎక్కడం రాలేదు.. తొక్కడం రాలేదు.. బాలయ్య వీడియో వైరల్

కొత్త సవాళ్లు..
ఈ కొత్త విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను సృజనాత్మక ప్రశ్నలకు అనుగుణంగా మార్చుకోవాలి. అదే సమయంలో, విద్యార్థులు సంప్రదాయ రాత పరీక్షలకు బదులు విశ్లేషణాత్మకంగా ఆలోచించే విధానాన్ని అలవర్చుకోవాలి. ఈ మార్పులు విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడంతోపాటు, విద్యార్థులను ఆధునిక పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.

Exit mobile version