Anchor Anasuya Latest Interview: జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ ని సంపాదించి, తద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అనసూయ(Anchor Anasuya Bharadwaj), ఈమధ్య కాలం లో బుల్లితెర కి దూరమైన సంగతి తెలిసిందే. కానీ ఈమధ్యనే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కిరాక్ బాయ్స్..కిలాడీ గర్ల్స్’ ప్రోగ్రాం లో గేమ్ చేంజర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలా అప్పుడప్పుడు పలు షోస్ లో కనిపిస్తూ ఉంటుంది కానీ, ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఆమె యాంకరింగ్ కొనసాగించడం కష్టం లాగానే అనిపిస్తుంది. అయితే రేపు, ఎల్లుండి ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవ్వబోయే జబర్దస్త్ 12 ఏళ్ళ వేడుకలో ఆమె కూడా పాల్గొనబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
Also Read: పాన్ ఇండియన్ హీరోలపై బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు..వీడియో వైరల్!
ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన భర్త భరద్వాజ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా భర్త చూసేందుకు చాలా అమాయకుడు లాగా కనిపిస్తాడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నా భర్త పర్ఫెక్ట్ కాదు. మిగతా మగవాళ్ల లాగానే ఆయన కూడా. నా వృత్తి పరంగా నేను సినిమా పరిశ్రమ లో ఉన్నాను కాబట్టి, ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. కానీ కొంతమంది తో కలిసి సినిమాలు, షోస్ వంటివి చేయడం నా భర్తకు ఇష్టం ఉండదు. ఈ విషయం లో ఆయనకీ నాకు ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. నేను అందమైన హీరోలతో కలిసినప్పుడు పాపం మా ఆయన కాస్త ఇబ్బంది పడుతుంటాడు. అబ్బాయిల మనస్తత్వమే అంత, నా భర్త కూడా అందుకు అతీతుడు కాదు’.
Also Read: స్టార్ హీరో సతీమణికి వేధింపులు..ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?
‘నా భర్తకు తెలుగు పూర్తిగా రాకపోవడం నేను చేసుకున్న అదృష్టం. అయితే నాతో ఎవరైనా పులిహోర కలపడం నాభర్తకు అసలు ఇష్టముండదు. ఇది పక్కన పెడితే అనసూయ భర్త ఇలాంటివన్నీ ఒప్పుకుంటున్నాడు, వాడు చేతకాని వాడు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా లోనే ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ లక్కీ గా మా ఆయనకు తెలుగు రాకపోవడం వల్ల, సోషల్ మీడియా కామెంట్స్ ని అసలు పట్టించుకోడు. నా భర్త తో ఉన్నంత సౌకర్యం, ఈ ప్రపంచం లో నాకు ఎవరితో ఉండదు’ అని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ నుండి భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.