Hari Hara Veeramallu First Week Collection: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. నిర్మాణ దశలోనే ఎన్నో అవాంతరాలను ఎదురుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత మీడియా లో ఎంతో నెగిటివిటీ ని సొంతం చేసుకుంది. ఇంత నెగిటివిటీ మధ్య విడుదల అవుతున్న సినిమా, దయచేసి ఫ్లాప్ టాక్ రాకుండా చూడు దేవుడా అని దేవుడ్ని కోరుకోని పవన్ కళ్యాణ్ అభిమాని ఉండదు ఏమో. కానీ అభిమానులు కోరుకున్నది ఒక్కటి కూడా జరగలేదు. ఎంతో ఆశతో ప్రీమియర్ షోస్ ని చూసేందుకు వచ్చిన అభిమానులే ఈ చిత్రానికి నెగటివ్ టాక్ చెప్పారు. కారణం VFX బాగా రాలేదని. అయితే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి అందించేందుకు మూవీ టీం ఏం చేసిందంటే!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం మొదటి వారం లో 19 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ రేంజ్ కి మొదటి రోజు రావాల్సిన వసూళ్లు ఇవి. ప్రీమియర్స్ షోస్ మరో గంటలో మొదలు అవుతాయి అనగా, అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ వ్యాప్తంగా షోస్ ని షెడ్యూల్ చేస్తే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో ఒక శాంపిల్ గా చూపించింది ఈ ప్రీమియర్ షోస్ గ్రాస్. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోస్ ని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసి ఉండుంటే, కచ్చితంగా ఈ చిత్రం కేవలం ప్రీమియర్ షోస్ నుండే పది కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట.
అంతే కాదు మొదటి రోజు బుకింగ్స్ కూడా విడుదల ముందు రోజు రాత్రి ప్రారంభించారు. దీని వల్లనే ఈ చిత్రం మొదటి రోజు 12 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టాల్సి వచ్చిందని, లేకపోతే 20 కోట్ల షేర్ మొదటి రోజే వచ్చేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ లో 8 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 7 కోట్ల 90 లక్షలు, ఉభయ గోదావరి జిల్లాలు కలిపి 10 కోట్లు, కృష్ణ జిల్లాలో 5 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో రెండు కోట్ల రూపాయిలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 కోట్లు, ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయిలు వచ్చాయి. మొత్తానికి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఏంటో ఇది..పవన్ కళ్యాణ్ కి మొదటి రోజు రావాల్సిన వసూళ్లు ఇవి. పాతబడిన సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే ఇలా కాకుండా ఇక ఎలా వస్తాయి లేండి, సెప్టెంబర్ 25 న ఓజీ తో చూసుకుందాం అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.