యూఎస్ సుంకాల ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేస్తున్నాం: పీయూష్‌ గోయల్

– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యూఎస్ 25శాతం సుంకాల‌పై పార్ల‌మెంట్‌లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ మాట్లాడారు.జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్లలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్‌ పయనిస్తోందన్న అంశాన్ని గుర్తుచేశారు.

భారత్‌ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25 శాతం పన్నులతోపాటు అదనంగా పెనాల్టీలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు. సుంకాల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.

– Advertisement –

Leave a Comment