Site icon Desha Disha

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు

-ఈ ఏడాది ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు

-గతంలో అప్లై చేసుకున్నవారు రెన్యువల్ కు అవకాశం

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో జాతీయ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి తమ దరఖాస్తులను రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. ఆసక్తిగల విద్యార్థులు http://scholarships.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మండలి సూచించింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025లో టాప్ 20వ పర్సంటైల్‌లో తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీబీఐఈ అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.inలో అందుబాటులో ఉందని పేర్కొంది.

ఈ జాబితాలో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగంలో మొత్తం 61,135 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 18,696 మంది, ఓబీసీలో 33,932 మంది, ఎస్సీలో 8,446 మంది, ఎస్టీలో 5,361 మంది, దివ్యాంగులు 43 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాలేజీలు, యూనివర్శిటీల విద్యార్థుల కోసం ఉద్దేశించిన సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ పథకం (సీఎస్ఎస్ఎస్) కింద తాజాగా దరఖాస్తులు, రెన్యూవల్ దరఖాస్తులకు చివరి తేదీని అక్టోబర్ 31ని దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించినట్లు పేర్కొంది.

Exit mobile version