Site icon Desha Disha

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బైపాస్ ఏర్పాటు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుపల్లి అనిరుధ్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూ ఢిల్లీలోని వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, జడ్చర్ల లలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, జడ్చర్ల బైపాస్ పూర్తయితే ఈ రెండు నగరాలలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని, రెండు నగరాలు అభివృద్ది చెందాలని, ఎక్కువ అవకాశం ఉంటుందని వారు కేంద్ర మంత్రికి వివరించారు. వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు చేయిస్తామని హమీ ఇచ్చారని, జోన్ స్టడీ చేసి డిపిఆర్ తయారు చేయాలని సూచించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే తెలిపారు.

Exit mobile version