‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

Kingdom Movie Public Talk

Kingdom Movie Public Talk: సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుతున్నాయి.. డైరెక్టర్ గౌతమ్ కథ బాగుంది. హీరో విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి చేశాడు. నిర్మాత నాగవంశీ అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించాడు. ఫొటో గ్రఫీ ఓ రేంజ్ లో ఉంది… కానీ.. సినిమాలో అదొక్కటే మైనస్ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు.

సినిమా కథ, కథనాలు బాగున్నా కేవలం యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సన్నివేశాలు తేలిపోయాయని.. ఏమాత్రం ఆకట్టుకోని విధంగా వాటిని రూపొందించారని సినిమాలో అదొక్కటే మైనస్ అంటూ పలువురు సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

విజయ్ దేవరకొండ గుండు గీసుకొని జుట్టు లేకుండా చేయడం హైలెట్ అని విజయ్ యాక్టింగ్ బాగుందని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బుల్లెట్లు కాల్చితే ఎక్కడ తగులుతున్నాయో అర్థం కావడం లేదంటూ అభిప్రాయపడుతున్నారు.

సినిమాకు సెకాండాఫ్ రిలీజ్ చేస్తామని పెట్టారని.. ప్రాపర్ ఎండింగ్ బాగా లేదని మరికొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. సెకండాఫ్ లో మంచి డ్రామా, ఎలివేషన్స్ లేవని మరికొందరు అన్నారు.

Leave a Comment