Site icon Desha Disha

ఒకే కారులో సమంత, రాజ్.. ఇవేమి పనులు బాబోయ్!

ఒకే కారులో సమంత, రాజ్.. ఇవేమి పనులు బాబోయ్!

Samantha Dating Rumors

Samantha Dating Rumors: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సమంత(Samantha Ruth Prabhu), రాజ్ నిడిమోరు(Raj Nidimoru) జంట ప్రేమలో ఉన్నారని, వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తోడు వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలను సమంతనే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుండడంతో వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నారని అందరూ ఒక నిర్ధారణకు వచ్చేసారు. సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ కి రెస్పాన్స్ ఇచ్చే అలవాటు ఉన్న సమంత, ఈ వ్యవహారం పై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆమె కచ్చితంగా రిలేషన్ లోనే ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. గత కొద్దిరోజుల క్రితమే రాజ్ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లిన సమంత. రీసెంట్ గా మరోసారి రాజ్ తో కలిసి కారులో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Also Read:  పోకిరీ తీసి పూరి నమ్మలేదు.. కృష్ణ ముందే చెప్పాడు…

నిన్న రాత్రి వీళ్లిద్దరు కలిసి ఒక రెస్టారంట్ కి డిన్నర్ కి వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. సమంత వైట్ డ్రెస్ లో కనిపించింది. ఫోటోగ్రాఫర్స్ ని చూడగానే ఆమె స్మైల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని బహిరంగంగా చెప్పేస్తే అభిమానులమైన మేము సంతోషిస్తాము కదా, ఇంకా ఎన్ని రోజులు ఇలా దాచిపెడుతూ, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటూ సోషల్ మీడియా లో సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత, రాజ్ ల పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా మొదలైంది. ఈ వెబ్ సిరీస్ సమయం లోనే సమంత కి నాగ చైతన్య తో మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సమంత మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి కావడం, ఆ సమయం లో రాజ్ నిడిమోరు ఆమెకు బాగా దగ్గరై బాగోగులు చూసుకోవడం వల్ల సమంత తన జీవితాన్ని అతనితో కలిసి పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా లో వినిపించే ఒక వార్త.

Also Read: కింగ్ డం మూవీ.. అది లేదట.. దానికోసం చూసిన వారికి షాక్

ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, రాజ్ నిడిమోరు సమంత ఎమోషనల్ గా, మానసికంగా బాగా డౌన్ గా ఉన్నప్పుడు ఆమె వెంటే ఉన్నాడు అనేది వాస్తవం. అయితే వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే చాలా కాలం విరామం తర్వాత ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి సమంత కి నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా లో నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలను వేగవంతంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version