Site icon Desha Disha

ఎస్ఐ వేధిస్తున్నాడని.. పోలీస్ స్టేషన్‌లోనే మహిళ ఆత్మహత్యాయత్నం

ఎస్ఐ వేధిస్తున్నాడని.. పోలీస్ స్టేషన్‌లోనే మహిళ ఆత్మహత్యాయత్నం

ఎస్ఐ వేధిస్తున్నాడని.. పోలీస్ స్టేషన్‌లోనే మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండల పోలీస్ స్టేషన్ లో చోటుచేసకుంది. నేరేడుచర్ల ఎస్ఐ రవీంద్ర నాయక్ సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఇంజంవారి గూడెం గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగింది. పోలీసులు స్పందించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వవరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version