ముంబయి: అలెక్సాతో కలిసి 3వ జనరేషన్ ఎకో షో 5 స్మార్ట్ డిస్ప్లేను అమెజాన్ భారతదేశంలో విడుదల చేసింది. ఇది కాంపాక్ట్ 5.5’’ స్మార్ట్ డిస్ప్లేతో పాటు అలెక్సాతో సులభమైన హోమ్ మానిటరింగ్, స్మార్ట్ హోమ్ నియంత్రణలను అనుమతించే అంతర్నిర్మిత కెమెరాతో సహా కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. దాని మునుపటి తరంతో పోల్చితే రెట్టింపు బాస్, స్పష్టమైన గాత్రాన్ని వినిపిస్తూ, ఇది ఇప్పటివరకు బెస్ట్-సౌండిరగ్ ఎకో షో 5. వినోదంతో కార్యాచరణను కలిపి, ఇది వినియోగదారులు తమకు అనుకూలమైన స్మార్ట్ గృహోపకరణాలను నిర్వహించేందుకు, సెక్యూరిటీ కెమెరాలు, డోర్బెల్లను వీక్షించేందుకు, చేయవలసిన పనుల జాబితాలు, అనునిత్యం చేసే పనులను జ్ఞాపకం చేసేందుకు, హ్యాండ్స్-ఫ్రీగా సంగీతాన్ని ప్లే చేసేందుకు సహాయపడుతుంది- వీటన్నింటినీ అలెక్సా తన శక్తితో చేస్తుంది.ఇప్పుడు ఆల్ న్యూ ఎకో షో 5 (3వ జెనరేషన్) చార్కోల్, క్లౌడ్ బ్లూ రంగులలో రూ.10,999 ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు దీన్ని అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఎంపిక చేసిన రిలయెన్స్, క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.
