YS Jagan Arrest Rumors: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మరోవైపు చూస్తే ఆయన గవర్నర్ ను కలవడం ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుందని అంతా భావిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఆ సందర్భంలో కూడా పలుమార్లు జగన్ ప్రస్తావన వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఆయనేనని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో నన్న ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత అరెస్టుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పార్టీకి తక్షణ నాయకత్వం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది.
Also Read: మంత్రివర్గంలోకి ఆ మహిళ ఎమ్మెల్సీ?!
అప్పట్లో వారు అండగా..
2012లో అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). అప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే జగన్ 16 నెలలపాటు జైలు జీవితం గడిపారు. అయితే ఆ సమయంలో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీకి అండగా నిలిచారు. పార్టీని నడిపించగలిగారు. అయితే ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటనేది ఒక రకమైన ప్రశ్న. అయితే గతం మాదిరిగా పార్టీ సవ్యంగా నడిచే ఛాన్స్ కనిపించడం లేదు. అప్పట్లో పార్టీ అనేది ప్రారంభ దశలో ఉంది. రాజశేఖర్ రెడ్డి మృతి సానుభూతి ఉంది. ఆపై జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా కేసుల్లో పెట్టారని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వ్యూహం ప్రకారం అరెస్టులు..
మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అంటిపెట్టుకొని ఉండే నాయకులు.. సలహాదారులుగా ఉన్న అధికారులు మొత్తం మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు. అరెస్టులు కూడా అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీని నడిపించే మనిషి కూడా కనిపించడం లేదు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం లోపలకు వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. వై వి సుబ్బారెడ్డి సైతం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు జగన్ సతీమణి భారతి రెడ్డి పేరు కూడా మద్యం కుంభకోణం కేసులో వినిపిస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయితే పార్టీకి పెద్దదిక్కు ఎవరు అనేది ఇప్పుడు చర్చ సాగుతోంది. తల్లితోపాటు సోదరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. సొంత కుటుంబ సభ్యులు నాయకత్వం తీసుకోవాలంటే కనిపించేది భారతీ రెడ్డి మాత్రమే.
Also Read: ఏపీలో ఉచిత ‘బస్సు’ ప్రయాణం.. కీలక ప్రకటన
పెద్దదిక్కుగా ఆ ఇద్దరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా ప్రస్తుతం బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అయితే కుమారుడు నిధులు రెడ్డి అరెస్టుతో బిజీ అయ్యారు పెద్దిరెడ్డి. రాజమండ్రి కే పరిమితం అవుతున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ శాసనమండలిలో విపక్షనేతగా ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే బొత్స సత్యనారాయణ లీడ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమ నేతలు సైతం పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అయితే జగన్ అరెస్ట్ అయితే పార్టీ నాయకత్వం మాటేంటి అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?