Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా కొత్త రేషన్ రేషన్ కార్డులను అందిస్తోంది. ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే వీటిలో కొన్నిటిని సర్వే చేసి అనర్హులను తీసివేశారు. అర్హులైన వారికి ఇప్పటికే రేషన్ కార్డులను అప్రూవ్ చేశారు. ఇందులో భాగంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అప్రూవ్ అయిన తర్వాత జూలై 25 నుంచి మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు. అయితే డిజిటల్ కార్డును అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి వాటిని ఎప్పటినుంచి పంపిణీ చేస్తారంటే?
Read Also: సరిదిద్దిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు మరోసారి
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వీటిలో 5.61 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేశారు. జూలై 25న ప్రారంభమైన రేషన్ కార్డుల మంజూరు పత్రాల ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఈలోగా రేషన్ కార్డు డిజిటల్ డిజైన్ ను పూర్తి చేయనున్నారు. ఆగస్టు 10 తర్వాత కొత్త కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డులను ప్రత్యేకంగా అందించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. కానీ ప్రత్యేకంగా ఎవరికి కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డు మంజూరు అయినవారు ఆన్లైన్లోనే ప్రింట్ తీసుకొని రేషన్ కోసం ఉపయోగించేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇవ్వడంతోపాటు.. వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇవ్వాలని నిర్ణయించింది.
Read Also: రాజమౌళి కథ చెబితే రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
గతంలో వైఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రేషన్ కార్డులను అందించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కొన్ని కార్డులు వచ్చాయి.. అయితే ఇప్పుడు కొత్తగాకు వచ్చే కార్డులు ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా వచ్చే కార్డులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతోపాటు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఫోటో కూడా ఉండే అవకాశం ఉంది.అలాగే కుటుంబానికి సంబంధించిన సభ్యుల పేర్లు.. వారి వివరాలు ఉంటాయి. ఆకర్షనీయంగా ఉండడానికి దీని డిజైన్ ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ కార్డులు సెప్టెంబర్ నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అప్పటివరకు ఏదైనా రేషన్ కార్డ్ అవసరం ఉంటే ఆన్లైన్లోనే FSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా చేర్చిన 5.61 లక్షల కొత్త కార్డులతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరుకుంది. ఈ కార్డు లో నుంచి 3.09 కోట్లమంది లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. వీరు ఇకనుంచి ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా ఈ కార్డును వాడుకునే అవకాశం ఉంది.