TDP BJP Alliance: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

TDP BJP Alliance: ఏపీకి కొత్తగా బిజెపి అధ్యక్షుడు వచ్చారు. యువ నేత పివిఎన్ మాధవ్( pvn Madhav) కొత్త అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. అయితే ఆయన ఎంపిక వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు అనుమతితోనే కొత్త అధ్యక్ష పదవిని బిజెపి హై కమాండ్ భర్తీ చేసిందన్న టాక్ బలంగా వినిపించింది. వాస్తవానికి మాధవ్ కు బలమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన తండ్రి పీవీ చలపతిరావు ఉమ్మడి రాష్ట్రంలోనే బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయస్థాయిలో బిజెపి అగ్ర నేతలతో కలిసి పని చేశారు. ఆర్ఎస్ఎస్ తో మంచి అనుబంధాలను కొనసాగించారు. పివిఎన్ మాధవ్ సైతం అసలు సిసలు బిజెపి వాది. అయితే ఆయన ఎంపికలో మాత్రం చంద్రబాబు సహకారం ఉందన్న ప్రచారం నడుస్తోంది.

పొత్తు మరింత పటిష్టం..
ఏపీలో( Andhra Pradesh) మూడు పార్టీల మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తు ధర్మంతో ముందుకు సాగాలన్నదే మూడు పార్టీల ముఖ్య ఉద్దేశం. చంద్రబాబుకు పెద్దన్న పాత్ర ఇచ్చి.. జాతీయస్థాయిలో ఏపీ నుంచి రాజకీయ ప్రయోజనాలు దక్కించుకొని.. పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇచ్చి… ఇలా మూడు ఫార్ములాలతో కూటమి ముందుకు వెళ్తోంది. అయితే బిజెపి పరంగా ఇతర నేతలకు పదవులు ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే పురందేశ్వరిని కొనసాగించాలని.. లేకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. కానీ సామాజిక వర్గ పరంగా చంద్రబాబు సిఫారసులకు పెద్దపీట వేశారని.. అందుకే ఆ సామాజిక వర్గ నేతలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా పివిఎన్ మాధవ్ ను నియమించారని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది.

Also Read: Amaravati Capital Development: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

మాధవ్ సంచలన ప్రకటన..
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ సంచలన ప్రకటన చేశారు. జగన్( Y S Jagan Mohan Reddy ) హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో ఆయన ప్రమేయం ఉందని.. ఆయన అరెస్టును ఎవరు ఆపలేరని.. తప్పకుండా అరెస్టు చేస్తారని తేల్చి చెప్పారు. అయితే గత దశాబ్ద కాలంగా అంటే.. 2014లో టిడిపి తో బీజేపీ కలిసి ఉండే సమయంలో కూడా ఓ రాష్ట్ర అధ్యక్షులు ఈ స్థాయిలో విమర్శలు చేసింది లేదు. కానీ మాధవ్ చేసిన విమర్శల వెనుక అనేక సంకేతాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో బిజెపి ఉదాసీనంగా లేదని స్పష్టమైంది. ఏపీలో టిడిపి పెద్దన్న పాత్రకు తమ మద్దతు ఉంటుందని సంకేతాలు ఇవ్వగలిగారు. అయితే మాధవ్ చేసిన ప్రకటనతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని వారికి తెలిసిపోయింది.

కఠినమేనని హెచ్చరికలు
ఇకనుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నోటి నుంచి ఇలాంటివి వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానిస్తోంది. అయితే టిడిపి కాకపోతే బిజెపితో చెలిమి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు వైసిపి నేతలు సిద్ధపడ్డారు. కానీ అటువంటి గేమ్స్ కు చెక్ చెప్పి.. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదని మాధవ్ సంకేతాలు ఇచ్చారు. అయితే మాధవ్ ఎంపిక వెనుక ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి ఎంపి హస్తం ఉంది. మరోవైపు మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం తనదైన రీతిలో పావులు కదిపారు. ఇకనుంచి బిజెపి ద్వారా, బిజెపి పేరు చెప్పి వైసిపి గేమ్ ఆడేందుకు చాన్స్ లేదు. ఇది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.

Leave a Comment