Posani Krishna Controversy: రాజకీయాలు అందరికీ సూట్ కావు.. ముఖ్యంగా సినీ నటులకు అంతగా సరిపోవు. కొంతమంది మినహా మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కనుమరుగైనవారే. కాకపోతే వెనుకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు అంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు కాదు. జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తన మార్క్ చూపించేవారు. తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే.. తెర ముందు మాత్రం కాస్త హుందాతనాన్ని ప్రదర్శించేవారు.
Read Also: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్
ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా మీడియాలో విశేషమైన ప్రాచుర్యం పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ అధికారం పోతే మాత్రం ఆ సినీ నటులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సినీ నటులపై విమర్శలు పెరిగిపోతున్నాయి.. కొంతమంది సినీ నటులు చేసిన వ్యాఖ్యల వల్ల పోలీస్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అలా పోలీస్ కేసులు నమోదైన వారిలో పోసాని కృష్ణ మురళి ఒకరు.
పోసాని కృష్ణ మురళి వైసీపీలో పనిచేశారు. వైసిపికి అనుకూలంగా మాట్లాడారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ కూడా అయ్యారు.. కొద్దిరోజులపాటు జైలు జీవితం కూడా గడిపారు. దీంతో ఆయనకు వాస్తవం బోధపడినట్టుంది. అనేక ఇబ్బందుల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. దీంతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు.
Read Also: రాజమౌళి కథ చెబితే రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
తను ఇకపై రాజకీయాలు చేయనని.. ఇటువంటి రాజకీయాలు మాట్లాడబోనని.. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండనని కృష్ణమురళి పేర్కొన్నారు. పైగా తన రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. దీని వెనక ఏముంది.. ఏం జరిగింది అనేది ముంజేతి కంకణమే. అందువల్లే రాజకీయ నాయకులు ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చివరికి ఇదిగో ఇలాంటి తత్వం ఎదురవుతుంది. కేవలం సినీ నటులు మాత్రమే కాదు రాజకీయాల్లో ఉండే వారందరికీ ఇది వర్తిస్తుంది. అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే.. ఆ కళ్ళను నేలకు దించే రోజులు కూడా వస్తాయి.