Chandrababu Singapore Visit: చంద్రబాబు సింగపూర్ టూర్ పై వైసీపీ మార్కు విషం

Chandrababu Singapore Visit: గులివింద సామెతలా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్(ysr congress) పార్టీ దుస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు సర్కారుపై నిందలు వేయాలి. ప్రజాక్షేత్రంలో తప్పుడు మనిషిగా చూపించాలి. కానీ ఇందుకు కనీసం అధ్యయనం చేయకుండా సొంత మీడియాతో పాటు సోషల్ మీడియాలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతోంది. సొంత మీడియా సాక్షిలో సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై విషం చిమ్ముతోంది. చంద్రబాబు ముఖం మీద నో చెప్పిన సింగపూర్..పెట్టుబడులు పెట్టబోం పో..అమరావతిలో అవినీతి రారాజుకు చుక్కెదురు..ఇలా లేనిపోని మాటలతో అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అదే సమయంలో సాక్షి మీడియాలో కనీసం వివరణ, వివరణాత్మక, విషయం లేని కథనాలు రాసింది. కానీ తీరా చదివినా.. ఆ ప్రచారాలు చూసినా అసలు విషయం ఏమీ కనిపించదు. అందులో ‘అక్కసు’ మాత్రమే కనిపిస్తోంది.

ఒప్పందాలు రద్దుచేసింది జగనే..
ఏపీ సీఎం చంద్రబాబు(AP CM chandhrababu) అవినీతిని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి అంటూ సాక్షి మీడియాలో కథనం వచ్చింది. సరిగ్గా సింగపూర్ పర్యటనలో చంద్రబాబు టీం ఉండగానే ఇటువంటి కథనం రాసింది. అయితే ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచానికి..అంతెందుకు మన నేషనల్ మీడియాకు సైతం ప్రత్యేకంగా ఏపీతో ఏం పని ఉంటుంది? కానీ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు.. అన్నింటికీ మించి సింగపూర్ తో ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు మాత్రం ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూశాయి. అంతర్జాతీయ మీడియా సైతం వార్తలు ప్రచురించింది. అప్పుడే ఏపీ పరువు పోయింది. ఈ పాలకుడెవడండీ అంటూ ఎక్కువ మంది జగన్ తప్పును ఎత్తిచూపారు. నేషనల్ మీడియా సైతం జగన్ చేసిన తప్పిదాన్ని హెచ్చరించింది. అది ముమ్మాటికీ తప్పుడు నిర్ణయంగా అభివర్ణించింది. నాడు సింగపూర్ తో ఒప్పందాలు యథావిధిగా కొనసాగించి ఉంటే.. అమరావతిని కొనసాగించి ఉంటే ఏపీ ప్రజల కలల రాజధాని ఇప్పటికే సాకారమయ్యేది. జగన్ రెడ్డికి రాజకీయంగా కూడా లాభించేది.

Also Read: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

చివరకు అక్కడ మంత్రికి ఇక్కడ లింక్..
2014లో అమరావతి(Amaravathi Capital) నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం అయ్యింది. అక్కడ అవినీతికి తావుండదు. అవినీతి విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే అప్పట్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా అమరావతి రూపకల్పనలో పాలుపంచుకునేందుకు కూడా ముందుకొచ్చింది. అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో సింగపూర్ ట్రేడ్ మినిస్టర్ గా ఈశ్వరన్ ఉండేవారు. ఒప్పందంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఆయన ఆ శాఖకు మంత్రి కాబట్టి. అయితే అదే ఈశ్వరన్ వైసీపీ హయాంలో సింగపూర్ లో ఓ కేసులో ఇరుక్కున్నారు. ఓ సన్నిహితుడి నుంచి వైన్ బాటిల్లు పొందారు. మరో స్నేహితుడికి చెందిన జెట్ విమానంలో ప్రయాణించి అతడితో పాటే ఒక హోటల్ లో బస చేశారు. అయితే బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంటూ అలా స్నేహితులతో కలిసి వెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం తప్పుపట్టింది. కేసు నమోదుచేసింది. అది చాలా చిన్న అంశం. కానీ జగన్ శిబిరం మాత్రం అమరావతి నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని..చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని ..అందుకే ఈశ్వరన్ అరెస్ట్ చేశారని చెబుతున్నారు. కానీ ఈశ్వరన్ వైసీపీ హయాంలో చిన్నపాటి కారణంతో అరెస్టు అయ్యారని మరుగున పడేశారు.

అది జగన్ తప్పిదమే..
ప్రస్తుతం సీఎం చంద్రబాబు టీం సింగపూర్ (Singapore) వెళ్లింది రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చేందుకు. పనిలో పనిగా అమరావతి రాజధానిలో భాగస్వామ్యం కావాలని విన్నవించేందుకు వెళ్లారు. అక్కడి పారిశ్రామికవేత్తలు ఇష్టముంటే పెట్టుబడులు పెడతారు. లేకుంటే పెట్టరు. అక్కడి ప్రభుత్వం నచ్చితే ఆసక్తి చూపుతుంది. లేకుంటే లేదు. వారికి ఇష్టం లేకుంటే చంద్రబాబు ముఖం మీద చెప్పరు కదా. ఆ పరిస్థితి వచ్చిందంటే అది ముమ్మాటికీ జగన్ తప్పిదం అవుతుంది కదా. సింగపూర్ తో ఒప్పందాలు రద్దు చేసుకుంది జగన్ సర్కారు కానీ.. చంద్రబాబు సర్కారు కాదు కథ. అంతెందుకు చంద్రబాబు సర్కారు పట్ల విముఖత ఉంటే సింగపూర్ ప్రతినిధులు ఎందుకు కలుస్తారు? అక్కడి పారిశ్రామికవేత్తలు ఎందుకు సమావేశం అవుతారు? కానీ చంద్రబాబు టీం చేస్తున్నది ప్రయత్నం. కానీ జగన్ టీం చేస్తున్నది విష ప్రచారం. మరో గొప్ప విషయం ఏమిటంటే 2019 నుంచి 2024 మధ్య మీకు అవమానం జరిగింది. క్షమాపణలు కోరేందుకు నేను వచ్చా అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలకు సింగపూర్ ప్రతినిధులు ఫిదా అవుతున్నారు. ఆయన సంస్కారానికి నమస్కరిస్తున్నారు.

Also Read:నుదుట సింధూరం.. జగన్ హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

వైసీపీకి సాక్షి శాపమే..
ప్రజలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన అభిప్రాయం మాత్రం లేనట్టు కనిపిస్తోంది. మేం ఏంచెబితే అది నమ్మేస్తారు అన్నట్టు ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఇదే అభిప్రాయానికి భిన్నంగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. దాని నుంచి కూడా గుణపాఠాలు నేర్వలేకపోతున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా వరమో.. శాపమో తెలియడం లేదు. సాక్షిలో వచ్చే కథనాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సాక్షి యాంకర్ చెప్పే కొట్టండి డీజేలు.. పెట్టండి కటౌట్లు.. వేయండి పూలు..అంటూ యాంకర్ వైసీపీ గెలుపు ధీమా మాటలను సోషల్ మీడియాలో చూసి ఇప్పటికీ జనాలు నవ్వుకుంటున్నారు. కానీ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు, వార్తలు చూసి ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన అభిప్రాయం ఉందన్న విషయాన్ని గుర్తించాలి.

Leave a Comment