Site icon Desha Disha

Ayyanna Patrudu seizes overloaded trucks: రోడ్డుపై లారీలను అడ్డగించి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలనం!

Ayyanna Patrudu seizes overloaded trucks: రోడ్డుపై లారీలను అడ్డగించి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలనం!

Ayyanna Patrudu seizes overloaded trucks: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు( speaker ayyannapathrudu) గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా దూకుడుగా ఉంటారు. అందునా ప్రజా సమస్యల విషయంలో చాలా చొరవ తీసుకుంటారు. అందుకే ఆయనను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఆయన స్పీకర్ గా మారిన తర్వాత హుందాగా ఉంటున్నారు. అంతకుముందు మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండే సమయంలో ఏ స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకు పడేవారో తెలియంది కాదు. స్పీకర్ గా మారిన తర్వాత తన దూకుడుకు కళ్లెం వేసుకున్నారు. అయితే అది రాజకీయంగానే కానీ ప్రజా సమస్యల విషయంలో కాదు అని నిరూపించారు. తాజాగా అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వెళుతుండగా ఆసక్తికర సన్నివేశం ఒకటి కనిపించింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

సడన్ గా కారు దిగి
అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గం నర్సీపట్నం(narsipatnam). ఆయన తన వాహనంపై వెళ్తుండగా.. ఆయన నియోజకవర్గ పరిధిలోని రాజుపేట దగ్గర లారీ ట్రక్కులు వెళుతున్నాయి. వాటిని చూడగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అనుమానం వచ్చింది. వెంటనే కారు ఆపమని చెప్పి కిందకు దిగారు. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కులను ఆపి ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. విశాఖలోని గంగవరం పోర్టు నుంచి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంలో ఉన్న పయనీర్ కంపెనీకి ఈ ట్రక్కులు వెళ్తున్నాయి. ఆ పరిశ్రమలకు ముడి సరుకులు తరలిస్తున్నాయి. అయితే సామర్థ్యానికి మించి ఓవర్ లోడుతో ఈ లారీలు వెళ్తున్నట్లు స్పీకర్ గమనించారు. వారి వద్ద బిల్లులను తీసి పరిశీలించారు. దీంతో అయ్యన్నపాత్రుడు అనుమానం నిజం అయ్యింది.

Also Read: రాయలసీమలో ఆ రైల్వేస్టేషన్లో వందలాది కార్లు.. ఏంటి కథ?

వంతెన ధ్వంసం..
గత కొంతకాలంగా ఈ ట్రక్కులు భారీ సామర్థ్యంతో వెళ్తుండడంతో తాళ్లపాలెం(Thallapalem) వంతెన పూర్తిగా దెబ్బతింది. మరోవైపు రోడ్డు కూడా ధ్వంసం అవుతోంది. ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో అయ్యన్నపాత్రుడు ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీవో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కులను పట్టుకోవాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. తాజాగా అయ్యన్నపాత్రుడు తనిఖీతో అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి. దీంతో అయ్యన్నపాత్రుడు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. ఆ ట్రక్కులను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ ట్రక్కుల కారణంగా తాళ్లపాలెం వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్పీకర్. అయితే స్పీకర్ స్వయంగా రంగంలోకి దిగి సామర్థ్యానికి మించి వెళ్తున్న లారీలను సీజ్ చేయడం పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version