AP Liquor Scam Latest updates: జగన్( Y S Jagan Mohan Reddy) గుట్టు మిథున్ రెడ్డి వద్ద ఉందా? ఆయన నోరు విప్పితే జగన్ కు ఇబ్బంది తప్పదా? మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అసలైన సూత్రధారుడా? మిగతా పాత్రదారులకు, అంతిమ లబ్ధిదారుడు మధ్య ఆయనే సంధానకర్తా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మద్యం కుంభకోణం కేసును వైసిపి తొలుత చాలా తేలిగ్గా తీసుకుంది. అసలు ఈ కేసు నిలబడడానికి కూడా చెబుతూ వచ్చింది. కానీ సిట్ పక్కా ఆధారాలు సేకరించడంతో వైసిపి శిబిరంలో ఒక రకమైన కలవరం ప్రారంభం అయ్యింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో పతాక స్థాయికి చేరింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసే సరికి వైసీపీ శ్రేణుల్లో మరింత ఆందోళన ప్రారంభం అయ్యింది. వరుస జరుగుతున్న ఘటనలు ఒక్కదానికి ఒకటి సింక్ అవుతుండడంతో ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది.
Also Read: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!
వారంతా ముందే అరెస్ట్..
ఇప్పటివరకు మద్యం కుంభకోణం( liquor scam) కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. తొలుత సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు. అటు తరువాత జగన్ ముఖ్యమంత్రి కార్యాలయ కీలక అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులు అరెస్టయ్యారు. అటు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైతం అరెస్టు చేశారు. అయితే వీరంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. కానీ వీరిని పరామర్శించేందుకు జగన్ సాహసించలేదు. తాడేపల్లికి కూత వేటు దూరంలో ఉన్న జైలుకు వెళ్లి పరామర్శించే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు జగన్ వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్ర ఉందన్నమాట. ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా అదే తరహా ఆందోళన ఉంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తల్లి అయితే మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
Also Read: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?
వారంతా సన్నిహితులే అయినా..
అయితే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులే. కానీ వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో అరెస్ట్ అయిన వారిని పరామర్శించకుండా.. వారం కిందట అరెస్టు అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని( Mithun Reddy) పరామర్శించడం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే అరెస్టు అయిన వారి కుటుంబాల్లో ఇదే ఆవేదన వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కోసం తమ వారంతా అలా పనిచేసి కేసుల్లో చిక్కుకున్నారని.. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం మిధున్ రెడ్డిని పరామర్శించడం ఏంటనేది ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఈ కేసులో మిధున్ రెడ్డి అసలు సూత్రధారి అని.. అంతిమ లబ్ధిదారుడికి మేలు చేసేందుకు.. మిగతా పాత్రధారులతో ఆట ఆడించారు అన్నది సిట్ వద్ద ఉన్న లెక్క. ఆ లెక్క ప్రకారమే ఇప్పుడు జగన్ సైతం.. మిగతా వారిని కాదని.. మిధున్ రెడ్డి ని మాత్రమే పరామర్శించేందుకు వస్తున్నారని ఒక అనుమానం. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఆ దేవుడికి ఎరుక.