AP Liquor Scam : కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.. అని ఓ సామెత ఉంది గుర్తుందా.. ఆ సామెత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మద్యం స్కాం కు అచ్చంగా వర్తిస్తుంది. ఎందుకంటే పేదల మద్యం అలవాటును అక్రమార్కులు తమకు వరంగా మార్చుకున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ద్వారా వందల కోట్ల దందాకు తెర లేపారు. ప్రజలు కోరుకున్న బ్రాండ్లు లభించలేదు. ఉన్న బ్రాండ్లను ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు. వారికి నచ్చిన బ్రాండ్ దొరకకుండా చేశారు.. ఇచ్చివరికి కల్తీ బ్రాండ్ లను అందుబాటులో ఉంచడంతో.. మద్యానికి అలవాటు పడ్డ మనుషులు తాగకుండా ఉండలేకపోయారు.
పైగా మద్యం షాపులలో డిజిటల్ చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. కేవలం నగదు చెల్లింపులను మాత్రమే ప్రోత్సహించారు. పైగా ఈ నగదు మొత్తాన్ని ఎటువైపు మరలించారో తెలియదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో కుంభకోణం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే విచారణ సాగిస్తోంది. హైదరాబాదులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 11 కోట్ల నగదు లభించడం.. ఈ కుంభకోణంలో భారీగా చేతులు నగదు మారింది అని చెప్పడానికి బలమైన నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం అది మాత్రమే కాదని.. అంతకుమించిన స్థాయిలో ఈ వ్యవహారం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నగదును మార్చడానికి రకరకాల ఖాతాలు ఉపయోగించారని.. కొన్ని సందర్భాలలో నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి ప్రయోగాలు చేశారని.. ఈ కుంభకోణంలో చాలామంది ప్రమేయం ఉందని.. లబ్ధి పొందిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాదులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దొరికిన 11 కోట్లు నగదు.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం స్థాయిని నిర్దేశిస్తున్నది. తాగుడు బానిసలను దోపిడీ ఒకచోట.. అక్రమార్కులు పోగేసుకున్న డబ్బు కట్టలు మరొకచోట.. అన్నట్టుగా మద్యం కుంభకోణం పరిస్థితి మారిపోయింది.. నిజానికి కల్తీ బ్రాండ్లు ప్రవేశపెట్టి.. ప్రజల ఆరోగ్యంతో నాటి ప్రభుత్వం చెలగాటం ఆడిందని కూటమినేతలు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛమైన పరిపాలన పక్కన పెడితే.. కనీసం కోరుకున్న బ్రాండ్ల మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాలేకపోయారని వారు మండిపడుతున్నారు. మద్యం వ్యవహారంలో అనేకమందికి పాత్ర ఉందని.. కొన్ని కంపెనీలకు.. వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఇష్టానుసారంగా వ్యవహరించారని.. అది ఇప్పుడు సిట్ దర్యాప్తులో బయటపడుతోందని కూటమినేతలు అంటున్నారు.