Amaravati Capital Development: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

Amaravati Capital Development: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతిని ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు నిధుల కోసం శ్రమించారు. ఆపై కేంద్ర ప్రభుత్వం కూడా సాయం ప్రకటించింది. దీంతో అమరావతికి నిధులు పోగయ్యాయి. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు సంస్థలు సైతం సన్నాహాలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం నిర్మాణాలు జరిపించేందుకు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వపరంగా రైల్వే, రోడ్డు ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి పనులు ఇక వేగవంతం అయినట్టే.

Also Read: Big Twist in AP Cabinet Expansion: సేఫ్ జోన్ లోకి ఆ మంత్రులు.. తెగ కష్టపడుతున్నారే!

2028 నాటికి కొలిక్కి
రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటే అమరావతి రాజధాని అనేది ప్రాధాన్యత అంశంగా మారింది. సాధారణ పరిపాలన కొనసాగిస్తూనే అమరావతిని పూర్తి చేయాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్లాన్. అదే సమయంలో సంక్షేమ పథకాలను సైతం పారదర్శకంగా అమలు చేసి ప్రజల అభిమానాన్ని పొందాలన్నది ప్రణాళిక. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలి. అమరావతి రాజధాని ఒక రూపం రావాలి. ప్రజలు దానిని గుర్తించాలి. 2029లో కూటమికి మరోసారి అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు దూరంగా ఆలోచన చేస్తోంది అదే. అయితే ప్రతిపక్షాలు మాత్రం వచ్చిన ఏడాదిలోనే అప్పులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాయి. అభివృద్ధి లేదని చెబుతున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం ఆ అభిప్రాయం లేదు. ఎక్కడ వ్యతిరేకత కనిపించడం లేదు. కానీ అసంతృప్తి మాత్రం వ్యక్తమవుతోంది.

Also Read: Galla Jayadev Political Comeback: గల్లా జయదేవ్ కు కీలక పదవి?

చంద్రబాబు ప్రయత్నం అదే..
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఇక ఆగదు. తాజాగా సింగపూర్( Singapore) వెళ్లారు చంద్రబాబు. తనతో పాటు ప్రత్యేక బృందాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్లారు. అయితే పనిలో పనిగా అమరావతి రాజధానికి కూడా సింగపూర్ బృందం సాయం అడగనున్నారు. గతంలో కూడా అమరావతి రాజధాని లో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. ఇప్పుడు కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ను పాలుపంచుకోవాలని ఆయన కోరే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు ఆలోచనలను ఇష్టపడే పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఉన్నత రంగాల్లో ఉన్నవారు ఉన్నారు. వారందరిని గతం మాదిరిగా అమరావతి నిర్మాణం కోసం సాయం చేయాలని అడిగితే మాత్రం తప్పకుండా ముందుకు వస్తారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని.. పి4 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాన్ని పెంచాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. వారికి సాయం చేసేందుకు మాత్రమే బంగారు కుటుంబాలు మార్గదర్శకులు పేరిట ఒక ప్రాజెక్టును రూపొందించారు. పేదలకు సాయం చేసే వీలుగా మార్గదర్శకులు కావాలని మాత్రమే విదేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులకు చంద్రబాబు కోరుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని కేవలం ప్రభుత్వమే చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అంటే సమాంతరంగా పాలనలో అభివృద్ధితోపాటు సంక్షేమం కొనసాగించనున్నారు అన్నమాట.

Leave a Comment