శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

– Advertisement –

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా తనిఖీ చేపట్టింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్ల వరకు ఉంటుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నా సదరు మహిళా అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా భారత్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

– Advertisement –

Leave a Comment