మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్న ఏపీ మహిళ! – Telugu News | Annamayya district women Kavvam vijayalakshmi winner mrs india season

అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పీసీఎల్ డీలర్‌గా ఉంటుంది. హైదరాబాద్ SBI లో చీఫ్ మేనేజర్‌గా ఆడిటింగ్ వింగ్‌లో పనిచేస్తున్న భర్త మహేష్ చక్రవర్తి ప్రోత్సాహంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొనింది. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలలపాటు జరిగింది. తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన విజయలక్ష్మి ఆన్లైన్‌లో జరిగిన రౌండ్స్‌లో గ్రాండ్ ఫినాలే కి ఎంపికైంది.

18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా విజయలక్షి కిరీటాన్ని దక్కించుకుంది. టాలెంట్ రౌండ్ రాంప్ వాక్ లాంటి పోటీల్లో మొదటి వయసులో నిలిచిన విజయలక్ష్మి ఈనెల 26, 27 తేదీల్లో ఢిల్లీ ఫామ్ రిసార్ట్స్‌లో జరిగిన ఫైనల్స్ లో టాప్ 1గా నిలిచి క్రోన్ దక్కించుకుంది. వీఆర్‌పీ ప్రొడక్షన్స్ ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ఫైనాలే పోటిల్లో విజేతగా 50 ఏళ్ల విజయలక్ష్మి నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment