Site icon Desha Disha

Stock Market: భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయింది. అయితే ప్రస్తుతం టాప్ 5 నష్టాలు, లాభాల్లో ఉన్న స్టాక్స్ ఏంటో చుద్దాం.

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈరోజు (డెసెంబర్ 2న) భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 10.37 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 581 పాయింట్లు క్షీణించి 71,689 వద్ద ఉండగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 157 పాయింట్లు పడిపోయి 21,584 పాయింట్ల పరిధిలో కొనసాగుతుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 366 పాయింట్లు కోల్పోయి 47,868 వద్ద ఉండగా..నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 511 పాయింట్లు నష్టపోయి 45,960 పరిధిలో ఉంది.

అయితే ఆసియాలోని అనేక మార్కెట్లు ఈరోజు బలహీనమైనంగా ప్రారంభమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు కూడా మార్కెట్ల పతనానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా, ఐరోపా మార్కెట్లు నిన్న న్యూ ఇయర్ సందర్భంగా పనిచేయలేదు. ఇక ఈరోజు ఆసియా పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, ఎన్టీపీసీ సూచీలు టాప్ 5 నష్టాల్లో కొనసాగుతుండగా.. డివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, సిప్లా, కోల్ ఇండియా టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.

Exit mobile version