Site icon Desha Disha

AP News: విజయవాడలో స్మశానవాటిక వద్ద ఆగంతకుడి హల్‌చల్

విజయవాడ, జనవరి 2: నగరంలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని స్మశాన వాటిక పొగ గొట్టంపైకి ఎక్కి ఓ ఆగంతకుడు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో పైకి ఎక్కి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని కిందకు దింపారు. మొత్తానికి ఆగంతకుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కింద దింపి కథను సుఖాంతం చేశారు. అయితే హల్‌ చల్ చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని పోలీసులు భావిస్తున్నారు. సదరు వ్యక్తి వాంబే కాలనీకి చెందిన సోమయ్యగా గుర్తించారు.

Exit mobile version