Powerful News To Prabhas Fans:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల కెజిఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.
ఇక ప్రస్తుతం దీని అనంతరం నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడి అలానే యువ దర్శకుడు మారుతీ తో మరొక సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇటీవల ఆనిమల్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మూవీ కూడా చెయ్యటానికి సిద్ధం అయ్యారు ప్రభాస్.
Powerful News To Prabhas Fans
ఈ మూవీలో ఆయన పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే విషయం ఏమిటంటే ప్రభాస్ తో మారుతీ తెరకెక్కిస్తున్న యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ని 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు నేడు ఉదయం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
Powerful News To Prabhas Fans
కెజిఫ్ చాప్టర్ 2 లో విలన్ గా నటించిన స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో ఒక కీలక పాత్రా చేస్తుండగా ప్రభాస్ కి జోడి గా ముగ్గురు యువ హీరోయిన్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ మూవీకి యువ సంగీత తరంగం ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ మూవీని పీపుల్ మీదకి ఫాక్టర్ సంస్థ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రేజీ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనబడుతుంది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి