భీమవరం టౌన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి):మాతా, శిశు మరణాలు సంభవించకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతతో చికిత్సను అందజే యాలని కలెక్టర్ నాగరాణి కోరారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాల యంలో మాతా శిశు మరణాలపై సమీక్షించారు. జిల్లాలో సంభవించిన ఎనిమిది మాతృ, శిశు మరణాలపై అధికారులను ప్రశ్నించారు. ఒకటి, రెండు కేసుల్లో వైద్యమందించే క్రమంలో కొంత నిర్లిప్తత కనిపిస్తోంది. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పలు మరణాలపై ఆరా తీసి, వాటికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రభుత్వ వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు, ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జి.గీతాబాయిని ఆదేశించారు. బాలుడు సోహైల్ మరణంపై మరింత జాగ్రత్తగా వైద్యం చేయాల్సి వుందన్నారు. మరణానికి దారి తీసిన పరిణామాలపై తదుపరి సమీక్షిస్తానని తెలిపారు.