దేశ దిశ

మస్క్‌ ప్రపంచ నం.1 | Mark Zuckerberg and Jeff Bezos Comply with Elon Musk in Billionaire Rankings


ABN
, Publish Date – Apr 03 , 2025 | 03:11 AM

ప్రపంచ కుబేరుల్లో టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ ఏఐ కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగించారు. 34,200 కోట్ల డాలర్ల ఆస్తితో…

మస్క్‌  ప్రపంచ నం.1

ప్రపంచ కుబేరుల్లో టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ ఏఐ కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగించారు. 34,200 కోట్ల డాలర్ల ఆస్తితో (రూ.29.24 లక్షల కోట్లు) మరోసారి ప్రపంచ నం.1గా నిలిచారు. మార్క్‌ జుకెర్‌బర్గ్‌ 21,600 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ (21,500 కోట్ల డాలర్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్‌ (19,200 కోట్ల డాలర్లు), లూయీ విట్టన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బెర్నార్డ్‌ అర్నో కుటుంబం(17,800 కోట్ల డాలర్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Read More Business News and Latest Telugu News

Updated Date – Apr 03 , 2025 | 03:11 AM

Exit mobile version