దేశ దిశ

‘భూ భారతి’తో భూ సమస్యలకు పరిష్కారం

‘భూ భారతి’తో భూ సమస్యలకు పరిష్కారం

కలెక్టర్‌ హనుమంతరావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట, వలిగొండ, తుర్కపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘భూ భారతి’తో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ హనుమంతరావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంలు అన్నారు. మంగళవారం రామన్నపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడారు. భూ సమస్యలు లేకుండా భూభారతి (ఆర్‌ఓఆర్‌ చట్టం) పోర్టల్‌ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కగా అప్పజెప్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్‌ హనుమంతరావు 30 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌, లాల్‌ బహదూర్‌, ఎంపీడీవో భూ క్య యాకుబ్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీమ్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారె డ్డి, పీఏసీఎస్‌ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు గంగుల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బోగారం గ్రామంలో పీఏపీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈవో కీర్తన, సెంటర్‌ ఇన్‌చార్జి ఎస్‌.గణేష్‌, సిబ్బంది సాయిబాబా పాల్గొన్నారు.

వలిగొండ మండలంలోని ఏదుల్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్‌ రైతులు పాల్గొన్నారు.

తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టిన కేసీఆర్‌ ప్రజలను తిరిగి మోసం చేసేందుకే వరంగల్‌ సభ నిర్వహించారని విమర్శించారు. భూభారతి చట్టంలో పేద ప్రజల అనేక రకాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్‌ ఇంటి నిర్మాణానికి శంకుస్థాన చేశారు. పల్లెపాలు స్టేజీ నుంచి బాబుల్‌నాయక్‌ తండా మీదుగా పరబాయి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐనాల చైతన్య పాల్గొన్నారు.

Updated Date – Apr 30 , 2025 | 12:59 AM

Exit mobile version