దేశ దిశ

నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్

నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం పరితపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజా రంజకమైన పాలనను అందిస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు శుభవార్త చెప్పింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు..

ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణులకు భృతిని పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నెలవారీ భృతిని రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వర్తించేలా ఈ జీవో జారీ చేసింది. నెలవారీ భృతిని 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కనీస మొత్తంగా 25 వేల రూపాయల భృతిని నాయీ బ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

TDP Andaman: అండమాన్ దీవుల్లోనూ టీడీపీ కూటమి జయకేతనం

Ind vs Pak: మన దేశంలో ఏం జరిగిందో ఐసీసీకి కూడా తెలిసే ఉంటుంది.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లపై బీసీసీఐ స్పందన

Exit mobile version