
బొప్పాయి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లావనాయిడ్స్, అల్‌కలాయిడ్స్ వంటి శక్తివంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బలపరిచే గుణం కలిగి ఉంటాయి. తరచూ అజీర్ణం, గ్యాస్, కడుపులో తేలికపాటి నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయి ఆకు నీటిని డ్రింక్ రూపంలో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో వాపు, మంట వంటి ఇన్‌ఫ్లమేటరీ సమస్యలకు బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సహజంగా పనిచేస్తాయి. వీటిని నీటిలో మరిగించి తీసుకుంటే శరీరంలోని నరాల దెబ్బలు, మస్కుల్స్ వాపు, గుండెకు సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇది హార్మోన్ అసమతుల్యత వల్ల వచ్చే వాపులకూ ఉపశమనం ఇస్తుంది.
బొప్పాయి ఆకుల నీరు పేగుల శుభ్రతలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో ఇది పేగుల కదలికను మెరుగుపరచుతుంది. మలబద్ధకం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పేగులలో ఉన్న హానికరమైన టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది.
బొప్పాయి ఆకుల్లో ఉండే శక్తివంతమైన జైవ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్‌ను నియంత్రించాలనుకునే వారికి సహజ మార్గంగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ విడుదలను మెరుగుపరచడంలో ఇది మంచి మద్దతుగా నిలుస్తుంది.
జుట్టు రాలడం, ఒత్తిడితో జుట్టు బలహీనపడే సమస్యలకు బొప్పాయి ఆకుల నీరు సహజమైన ఉపశమనంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు మెరుపుతో ఆరోగ్యంగా కనిపిస్తుంది.
బొప్పాయి ఆకుల నీటిని కొన్ని రోజులు తాగడం వల్ల శరీరంలో ఉన్న విషతుల్య పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది సహజమైన డిటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఎటువంటి రసాయన పద్ధతులు లేకుండా శరీరం శుభ్రంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)