హీరో రాజు, ఆయన సతీమణి సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ‘ఖుషి’ డాన్స్ స్టూడియో ప్రారంభమై, దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని వారి డాన్స్ స్టూడియో వద్ద ఘనంగా తొలి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుతుబుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, చిత్రం శ్రీను, ‘సోదర’ చిత్ర నటుడు సంజోష్, ‘అన్వేషి’ చిత్ర నిర్మాత కిరణ్ కందుల, కొరియోగ్రాఫర్ బాబి, పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ చేసిన డాన్స్ ప్రోగ్రాములు అందరినీ విశేషంగా అలరించాయి.
‘చారితో పూరి’, ‘వైతరణి రాణి’, ‘ఐ 20′ చిత్ర నటుడు రాజు మాట్లాడుతూ,’ ‘నా మిత్రుడు సురేష్ సపోర్ట్ చేయడం వల్ల, అలాగే మీరంతా నాకు అండగా నిలబడటం వల్ల నేను ఈరోజు ఇంతగా ఎదుగుతున్నాను. డిఫరెంట్ డాన్స్ కాన్సెప్ట్స్‌తో పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.