ఉగ్రదాడిలో తృటిలో తప్పిన ముప్పు.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అవ్వడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఫ్యామిలీ

Written by RAJU

Published on:


ఉగ్రదాడిలో తృటిలో తప్పిన ముప్పు.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అవ్వడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఫ్యామిలీ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నుంచి కేరళకు చెందిన ఒక కుటుంబం తృటిలో తప్పించుకుంది. దీనికి కారణం మటన్ రోగన్ జోష్ ఆహారమే అని చెబుతోంది ఆ ఫ్యామిలీ. ఆకలి మీద ఉన్న ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే మటన్ రోగన్ జోష్ లో ఎక్కువగా ఉప్పు ఉండడంతో పహల్గామ్‌ కి వెళ్ళాల్సిన సమయంలో మార్పు జరగినట్లు ఆ ఫ్యామిలీ చెబుతోంది. ఇలా ప్రాణాలతో బయటపడిన ఫ్యామిలీ కొచ్చికి చెందిన లావణ్య తన పది మంది కుటుంబ సభ్యులతో సెలవులు గడిపేందుకు కశ్మీర్ కి వెళ్ళింది.

లావణ్య ఆమె భర్త ఆల్బీ జార్జ్, తమ ముగ్గురు పిల్లలతో పాటు ఆల్బీ తల్లిదండ్రులు, ఒక బంధువు సోదరి.. ఆమె కుటుంబంతో కలిసి ఒక బృందంగా శ్రీనగర్ రెండు రోజుల ముందు వెళ్ళింది. శ్రీనగర్ నుంచి పహల్గామ్ కి దాడి జరిగిన రోజు.. లావణ్య మొత్తం ఫ్యామిలీ సంఘటనా స్థలం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 నుంచి 20 గుర్రాల గుంపు భయంతో కిందికి దూసుకుపోతున్నట్లు తాము గమనించినట్లు చెప్పింది లావణ్య.

ఉగ్రదాడి విషయంపై లావణ్య మాట్లాడుతూ.. మేము పహల్గామ్ లో రెండు రోజుల పాటు పర్యటించాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పారు. బైసరన్‌ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా 10 నుంచి 20 గుర్రాలు కిందకు దూసుకుపోతున్నట్లు చూశాము. జంతువులు భయాందోళనలో ఉన్నాయి. అది మేము చూసి అక్కడ ఏదో జరగరాని సంఘటన జరిగినట్లు మేము వెంటనే గ్రహించాము” అని లావణ్య చెప్పింది.

మొదట్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి అని అనుకున్నాము అయితే తర్వాత అది కాదని అర్థం చేసుకున్నాము. అయినా సరే మేము పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాము.. అయితే అప్పుడు క్రిందికి వస్తున్న కొన్ని వాహనాలు మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని మాకు సంకేతాలు ఇచ్చాయి. CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), పర్యాటకుల మధ్య కొంత వాదన చెలరేగిందని ఎవరో మాకు చెప్పారు. దీంతో తాము బైసరన్‌ కి వెళ్ళాలనే ఆలోచన మానుకున్నట్లు తెలిపింది లావణ్య.

అయితే తామున్న ప్రాంతలో పరిస్థితిని గమనించకుండా అక్కడ ఫోటోలు దిగడం తాము ప్రారంభించామని చెప్పింది. అదే సమయంలో “ఒక మహిళ ఏడుస్తూ CRPF తో నడుస్తూ వస్తుంది.. అది చూసినప్పుడు ఇక్కడ ఏదో జరిగింది.. పరిస్థితి సరిగ్గా లేదని మేము గ్రహించాము” అని లావణ్య అప్పటి తమ పరిస్థితి గుర్తుచేసుకుంది. అయితే తమ స్నేహితులు, బంధువుల నుంచి ఫోన్ కాల్స్ తో తమకు ఎంత ప్రమాదం నుంచి తప్పిమ్చుకున్నామో తెలిసిందని చెప్పింది లావణ్య.

లావణ్య తమకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆలస్యానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను ప్రశంసించింది.. ఒకరు రెస్టారెంట్ సిబ్బంది.. మరొకరు ఆమె భర్త. శ్రీనగర్ లో పర్యాటకుల రద్దీతో నిండిపోయింది. దీంతో తాము సరిగ్గా భోజనం చేయలేదు. దీంతో మంగళవారం పహల్గామ్ సమీపంలో తన భర్త ఒక రెస్టారెంట్‌ దగ్గర ఆగమని చెప్పి భోజనం చేద్దామని పట్టుబట్టారు. దీంతో మేము అక్కడ దాదాపు గంటన్నర సమయం గడిపాము” అని ఆమె చెప్పింది.

“మేము ఆర్డర్ చేసిన మటన్ రోగన్ జోష్ చాలా ఉప్పగా ఉంది. ఎక్కువగా ఎముకలున్నాయి. దీంతో మా అత్తమామలు ఆ ఫుడ్ తినడం కష్టం అయింది. ఇదే విషయాన్ని మేము రెస్టారెంట్ సిబ్బందికి చెప్పాము. వారు మళ్ళీ ఆహారం ఇస్తామని.. ఆలస్యం అయినా తిని వెళ్ళమని పట్టుబట్టారు. దీంతో అనుకున్న సమయానికి మేము ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి చేరుకోలేక పోయినట్లు వెల్లడించింది. లావణ్య. ఇంకా శ్రీనగర్‌లోనే ఉన్న లావణ్య కుటుంబం ఏప్రిల్ 25న కేరళకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights