డెలివరీ కాకపోవడంతో..
“నేను అతని దగ్గరికి వెళ్లి నా కారును తదనుగుణంగా పార్క్ చేస్తాను కాబట్టి ఎంత సమయం పడుతుంది అని అడిగాను” అని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నాడు, దీనికి డెలివరీ వ్యక్తి “కొన్ని నిమిషాలు సర్” అని సమాధానమిచ్చాడు. కాసేపు మాట్లాడిన తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో లంచ్ చేయడానికి కారణమేంటని ఆ డెలివరీ బోయ్ ను అడిగానని వర్మ తెలిపాడు. “సర్ నేను మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఆర్డర్ తీసుకున్నాను. నేను ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్లాను, కానీ ఆర్డర్ స్వీకరించడానికి ఎవరూ రాలేదు” అని డెలివరీ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు. చాలాసేపు వెయిట్ చేసినా ఎవరూ రాకపోవడంతో, ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లుగా మార్క్ చేయాలని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ను కోరానని తెలిపాడు. ‘అలా చేస్తే, ఆ ఆర్డర్ లోని ఫుడ్ ను జొమాటో రూల్స్ ప్రకారం డెలివరీ బోయ్ ఏమైనా చేయవచ్చు. అలా, ఆ ఆర్డర్ ను నేను తీసుకున్నాను’’ అని వివరించాడు.