ABN
, Publish Date – Apr 06 , 2025 | 03:43 AM
వేసవి కావడంతో ఎండలు భగభగమండుతున్నాయి. ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు వాడతారు.

నారాయణఖేడ్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): వేసవి కావడంతో ఎండలు భగభగమండుతున్నాయి. ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు వాడతారు. కానీ, ఎండాకాలం సీజన్ ప్రారంభంలోనే నిమ్మకాయల ధరలు సైతం ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కూరగాయల మార్కెట్‌లో ఇటీవలి వరకూ కిలో నిమ్మకాయలు రూ.100లకు విక్రయిస్తే.. ఒక్కో నిమ్మకాయ సైజ్‌ను బట్టి రూ.5-10 పలికాయి. మూడు రోజులుగా కిలో నిమ్మకాయలు రూ.200లకు విక్రయిస్తున్నారు.
ఒక్క నిమ్మకాయను రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి జనాలు భయపడుతున్నారు. ఈ సీజన్‌లో నిమ్మకాయల దిగుబడి తగ్గడంతోపాటు వాటికి గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా వాటి ధర పెరిగిందని చెబుతున్నారు.
Updated Date – Apr 06 , 2025 | 03:43 AM