Worry of India in Pakistan Military.. Officers and jawans resign

Written by RAJU

Published on:

  • పాకిస్తాన్ ఆర్మీలో భారత్ భయం..
  • వరసగా సైన్యాధికారులు, జవాన్‌ల రాజీనామాలు..
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం..
Worry of India in Pakistan Military.. Officers and jawans resign

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారత్ దేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు. ఆయన ఫ్యామిలీని లండన్‌కి తరలించాడు. మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామాల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన 250 మందికి పైగా అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారి, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: BJP MP: ‘‘పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’.. నిషికాంత్ దూబే సంచలనం..

అయితే, పాక్ ఆర్మీ కానీ, ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇదే నిజమైతే, యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదొడుకలను ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యలేమి స్పష్టంగా కనిపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చేతిలో పాక్ ఆర్మీ, ఫ్రాంటియర్ కార్ఫ్స్ ఎదురుదెబ్బలు తింటోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ తాలిబాన్లు సైన్యంపై తరుచుగా దాడులు చేస్తూ, పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు.

ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది. తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు జనాన్లు నో చెబుతున్నారు. ఒక వేళ అక్కడకి ట్రాన్స్‌ఫర్ అయితే బతికి ఉంటామో లేదో తెలియక ముందే రాజీనామా చేస్తున్నారు. ఇందులో మరో కోణం ఏంటంటే, ఇలా వెళ్లని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ ‘కోర్ట్ మార్షల్’ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా శిక్షలు విధించినా మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలోని భావిస్తోంది. ఇప్పుడు, భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights