‘లివింగ్ నోస్ట్రాడమస్’ గా ప్రసిద్ధి చెందిన 38 ఏళ్ల బ్రెజిలియన్.. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అథోస్ సలోమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత ప్రపంచం వణికిపోయింది. ఎందుకంటే COVID-19, క్వీన్ ఎలిజబెత్ II మరణం, ఉక్రెయిన్‌పై రష్యా వినాశకరమైన దాడి వంటి సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేయడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతో సలోమ్ ప్రపంచం ఒక పెద్ద సంక్షోభం అంచున ఉందని చెప్పడంతో వణికిపోతున్నారు.
మిర్రర్ UK నివేదించినట్లుగా.. సలోమ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం పెద్ద యుద్ధం ముందు ఉందని హెచ్చరించాడు. ఇటీవల సంఘటనలు ప్రపంచం సంఘర్షణ జరగబోతోందని చూపిస్తోందని ఆయన అన్నారు. దీనిని ‘భయంకరమైన భౌగోళిక రాజకీయ నమూనా’కు సంకేతంగా ఆయన అభివర్ణించారు. సంప్రదాయ పోరాటాలు కాకుండా కమ్యూనికేషన్ లైన్స్ కత్తిరించడం వంటి వ్యూహాలు, హైబ్రిడ్ వార్‌ఫేర్ దాడులు ఇప్పటికే ప్రపంచాన్ని గందరగోళం వైపు నెట్టివేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచం విధ్వంసం అంచున ఉందని సలోమ్ చెబుతున్నాడు. సలోమ్ అంచనా మూడవ ప్రపంచ యుద్ధంతో ముడిపడి ఉంది. జనవరిలో లాట్వియా, స్వీడన్ మధ్య సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దెబ్బతినడాన్ని ఆయన తన వాదనకు రుజువుగా పేర్కొన్నాడు. డిసెంబర్‌లో ఫిన్నిష్ పోలీసులు రష్యన్ ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న సంఘటనను కూడా ఆయన ప్రస్తావించాడు, ఈ ట్యాంకర్ ఫిన్లాండ్, ఎస్టోనియా మధ్య విద్యుత్ .. కమ్యూనికేషన్ కేబుల్‌లను దెబ్బతీసిందని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
‘లివింగ్ నోస్ట్రాడమస్’ సలోమ్ చెప్పిన ప్రకారం.. సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్స్ ధ్వంసమైతే, ‘డిజిటల్ బ్లాక్అవుట్’ ప్రమాదం ఉంది. ఇది సైనిక సామర్థ్యాలకు ముప్పు కలిగించవచ్చు. అప్పుడు ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది. దీనితో పాటు బాల్టిక్ సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతను ‘అదృశ్య యుద్ధం’గా కూడా ఆయన అభివర్ణించారు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.
ఈ ప్రపంచ సంఘటనల నమూనాను మునుపటి ప్రపంచ యుద్ధాలకు దారితీసిన వాటితో ఆయన పోల్చారు. నేడు మనం హైబ్రిడ్ యుద్ధ యుగంలో జీవిస్తున్నామని.. ఇంటర్నెట్ కేబుల్స్ నాశనం సైనిక దాడి వలె వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని లివింగ్ నోస్ట్రాడమస్ చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..