WITT 2025: TV9 గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు షెడ్యూల్‌ ఇలా! హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు

Written by RAJU

Published on:

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే మూడవ ఎడిషన్‌లో భాగంగా నేడు(శనివారం) రెండో రోజు జరిగే కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం ఉదయం 9:55 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా, ఉదయం 9:55 గంటలకు వెల్‌కమ్‌ స్పీచ్‌ ఉంటుంది. ఈ రోజు జరిగే కార్యక్రమానికి బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ధీరేంద్ర శాస్త్రి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

టీవీ9 సమ్మిట్ తొలిరోజున ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని అనేక రంగాల గురించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. 70 సంవత్సరాలుగా భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, కానీ గత 10 సంవత్సరాలలో దేశం 5వ స్థానానికి చేరుకుంది. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని పేర్కొన్నారు.

రెండో రోజు పూర్తి షెడ్యూల్

ఉదయం 9:55 గంటలకు వెల్‌ స్పీచ్‌ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు స్పెషల్‌ ఏవీ ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు – పండిట్ ధీరేంద్ర శాస్త్రి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రసంగిస్తారు.

ఎవరెవరు పాల్గొంటున్నారంటే..?

మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాతారు. తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు- డాక్టర్ నవనీత్ సలుజా ఇండియా హెల్త్ అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు డాక్టర్ కేటీ మాహే ఇండియా లెర్నింగ్ టు లీడ్ అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు షాహిద్ అబ్దుల్లా గ్లోబల్ సౌత్ గురించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు, బీహార్ రాజకీయాల్లో ఎదుగుతున్న నాయకుడు చిరాగ్ పాస్వాన్ ప్రసంగిస్తారు. తరువాత, మీ సర్దార్ కార్యక్రమం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుంది. తరువాత సాయంత్రం 4:00 గంటలకు బీజేపీ కమల విప్లవం. సాయంత్రం 4:30 గంటలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒకే దేశం, ఒకే చట్టం గురించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5:00 గంటలకు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విశ్వగురు కౌంట్‌డౌన్ గురించి మాట్లాడుతారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు షెడ్యూల్

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సాయంత్రం 5.30 గంటలకు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సాయంత్రం 6:00 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత స్మృతి ఇరానీ సాయంత్రం 6:30 గంటలకు ప్రసంగిస్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సాయంత్రం 7 గంటలకు హాజరవుతారు. రాత్రి 7:30 గంటలకు బీహార్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సమావేశంలో పాల్గొంటారు. 8 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనితో ఈ కార్యక్రమం నేటికి పూర్తవుతుంది.

WITT 2025 | Day 2 | News9 Global Summit | Business and Economy | What India Thinks Today

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights