Well being Suggestions : తరచూ సెలూన్‌కు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

Written by RAJU

Published on:

అందాన్ని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్టైల్‌దే కీలకపాత్ర. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ఫాలో అయ్యే నేటి తరం సెలూన్ల ముందు క్యూ కట్టేస్తుంటారు. అందంగా, స్టైలిష్‌గా కనిపించాలనే తపనతో తరచూ స్ట్రెయిటెనింగ్, కర్లింగ్, హెయిర్ డై తదితర సెలూన్ ట్రీట్‌మెంట్‌లు ట్రై చేస్తుంటారు. సెలబ్రిటీలను ఆరాధించేవారు అలాగే హెయిర్‌కట్‌లు చేసుకుని మురిసిపోతుంటారు. పైకి ఇదంతా సాధారణ విషయంలాగే కనిపించినా అందాన్ని ఇనుమడింపజేసే ఈ సెలూన్ ట్రీట్‌మెంట్లు ప్రాణానికే ముప్పు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. సెలూన్లలో వాడే ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెంచుతాయని పలు పరిశోధనల్లో రుజువైంది. అందుకే, ఫ్యాషన్‌గా కనిపించాలనే మోజుతో తరచూ సెలూన్‍‌కు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

హెయిర్ స్ట్రెయిటెనింగ్, డైయింగ్ సమయంలో వాడే రసాయనాల్లో కొన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయి క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. డై ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుందని, అయితే, ఇందులో ఉండే రసాయనాలు శరీరంలోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.

హానికరమైన రసాయనాలు

చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించే హెయిర్ డైలో ఉండే అనేక రసాయనాలు (అమోనియా, పారాఫిన్ వంటివి) కణాలను దెబ్బతీసి క్యాన్సర్‌కు కారణమవుతాయని ఒక పరిశోధలో తేలింది. ఈ రసాయనాలు తల, మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.ఇంకా హెయిర్ స్ట్రెయిటెనింగ్, బ్లో డ్రైయింగ్ వంటి ఇతర సెలూన్ ట్రీట్‌మెంట్ల నుంచి కోసం వాడే పరికరాల్లో అత్యంత ప్రమాదకరమైన ఫార్మాల్డిహైడ్ ఉంటుంది.

ఫార్మాల్డిహైడ్ అంటే ఏమిటి?

ఫార్మాల్డిహైడ్ ఒక రకమైన క్యాన్సర్ కారకం. ఈ రసాయనం జుట్టును నిఠారుగా , మృదువుగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది తలపై ఉండే ఎపిడెర్మల్ కణాలలో మార్పులకు కారణమై క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మం చికాకు వంటివి కలిగిస్తాయి. అందుకే సెలూన్‌లో హానికర ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారేమో చెక్ చేసుకోండి. సురక్షితమైన ఉత్పత్తులే వాడతున్నారని నమ్మకం కలిగిన సెలూన్లకు వెళ్లేందుకే ప్రాధాన్యం ఇవ్వండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights