Papaya Health Benefits: బొప్పాయి చాలా రుచికరమైన పండు. ఇందులో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి పండును జ్యుస్‌గా చేసుకోని తాగుతారు. ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అంతే కాదు బొప్పాయి వినియోగం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండు సహజ విరేచనకారి. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఉబ్బరం నిరోధిస్తుంది.
బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బొప్పాయి తినడం ఆరోగ్యకరమైన గుండెకు చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని వల్ల వచ్చే మరో ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే ఇది బరువు పెరగడాన్ని నియంత్రిస్తూ శరీర బరువును తగ్గిస్తుంది.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది, ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)