పెసరపప్పు భారతీయుల ఆహారంలో చాలా ప్రధానమైనది. పెసరపప్పుతో చాలా రకాల వంటకాలు తయారుచేస్తారు. ముఖ్యంగా పండుగలు, పూజలలో పెసరపప్పును వడపప్పు పేరుతో నైవేద్యం పెట్టడం తప్పనిసరి. ఆయుర్వేదం కూడా పెసరపప్పును గొప్ప ఆహారంగా చెబుతుంది. శాస్త్రీయ వైద్యం పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెబుతుంది. ఇలా ఏ వైద్యం అయినా పెసరపప్పును గొప్పగానే చెబుతాయి. ప్రతిరోజూ పచ్చి పెసరపప్పు(నానబెట్టిన పెసరపప్పు) తింటే చాలా ఆరోగ్యం అని, దీని వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
పచ్చి పెసరపప్పులో ఫైబర్, విటమిన్ బి, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పును రోజూ తింటూ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
పచ్చి పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ నానబెట్టిన పెసరపప్పును తింటూ ఉంటే మలబద్దకం సమస్య రానే రాదు. మలబద్దకం సమస్య వచ్చినవాళ్లు ఆ సమస్య నుండి బయటపడతారు. పేగు సమస్యల నుండి కూడా ఉపశమనం ఉంటుంది.
పచ్చి పెసరపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ కనీసం గుప్పెడు పచ్చి పెసరపప్పు తింటే మంచిది.
ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్యకు కూడా పచ్చి పెసరపప్పు చెక్ పెడుతుంది. పచ్చి పెసరపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణం వల్ల శరీరానికి ఐరన్ పుష్కలంగా అంది హిమోగ్లోబిన్ మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది.
పచ్చి పెసరపప్పులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ప్రతి రోజూ పచ్చి పెసరపప్పు తింటూ ఉంటే శరీర రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. సీజనల్ సమస్యలు, ఇన్ఫెక్షన్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు.
కాల్షియం, మెగ్నీషియం కూడా పచ్చి పెసరపప్పులో ఉంటాయి. రెగ్యులర్ గా పచ్చి పెసరపప్పు తినడం వల్ల ఎముకలు బలంగా మారడంతో పాటు కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
https://www.andhrajyothy.com/2024/navya/beauty-tips/multani-mask-is-enough-to-get-rid-of-oily-skin-ssd-spl-1281641.html#google_vignette