Well being Ideas: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు..

Written by RAJU

Published on:

భారతీయుల ఆహారంలో నెయ్యని ప్రధానంగా పరిగణిస్తారు. హిందూ సాంప్రదాయ భోజనంలో నెయ్యి చివరగా వడ్డిస్తేనే వడ్డన పూర్తైనట్టు. ఇక సాంప్రదాయ వంటకాల నుండి బోలెడు రకాల తీపి పదార్థాల తయారీ వరకు, కొన్ని రకాల సాంప్రదాయ వంటకాలలోనూ నెయ్యిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దేవుడి నివేదన కోసం తయారుచేసే ఆహారాలలో నెయ్యి కీలకంగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు కారంగా ఉన్న ఆహారాలలో నెయ్యిని జోడించి తినడం అందరికీ తెలిసిందే.. ఆయుర్వేదంలోనూ నెయ్యిని గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. అయితే నెయ్యి అందరికీ ఆరోగ్యం కాదని, కొందరికి చాలా హాని చేస్తుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఇంతకీ నెయ్యిని ఎవరు తినకూడదు తెలుసుకుంటే..

Ghee Coffee: నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగా సహాయపడుతుందా..

శతాబ్దాలుగా భారతీయుల ఆహారంలో, భారతీయ వంటగదులలో నెయ్యి ప్రధానంగా ఉంది. నెయ్యిలో విటమిన్-ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. నెయ్యి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఊబకాయం, అధిక బరువు..

ఊబకాయం, అధిక బరువు సస్య ఉన్నవారు నెయ్యి తీసుకోవడం అంత మంచిది కాదు. నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వులు ఉంటాయి. ఇప్పటికే అధిక బరువుతో ఉన్నవారు నెయ్యి తీసుకుంటే మరింత బరువు పెరగడానికి దారి తీస్తుంది.

గుండె రోగులు..

నెయ్యిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి. లేదంటే వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఇలాంటి వారు నెయ్యిని చాలా పరిమితంగా తీసుకోవాలి.

Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..

కాలేయ సమస్యలు..

కాలేయ సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యి తీసుకోవడం మానేయాలి. నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది, దీని కారణంగా కాలేయం దానిని జీర్ణం చేయడానికి అదనంగా కష్టపడాల్సి వస్తుంది. ఇది కాలేయం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పొట్ట సంబంధిత సమస్యలు..

నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం అసిడిటీ లేదా ఇతర పొట్ట సమస్యలు పెరుగుతాయి. కడుపు సమస్యలు ఉన్నవారు నెయ్యిని పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తీగా మానేయడం మంచిది.

ఇది కూడా చదవండి..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights