Well being: రాత్రి లేటుగా నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామునే లేస్తున్నారా! అయితే..

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: కొందరు రాత్రిళ్లు లేటుగా పడుకుని మరుసటి రోజు తెల్లవారు జామునే లేస్తుంటారు. ఇలా చేస్తూ సమయపాలన పాటిస్తున్నామని భావించే వారు తెలీక పెద్ద పొరపాటు చేస్తున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే పంథా కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు (Health).

నిద్ర తక్కువైతే ఒంట్లో ఒత్తిడి కారక కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయట. దీర్ఘకాలంలో ఇది ఆందోళనకు దారి తీస్తుంది. ఇలా ఒత్తిడి కొనసాగితే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Recall Method: ఈ టెక్నిక్ ఫాలో అయితే మతిమరుపుపై శాశ్వత విజయం!

నిద్రించే సమయంలో రోగనిరోధక శక్తి పునరుత్తేజితమవుతుంది. నిద్ర తక్కువైన సమయాల్లో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాల ఉత్పత్తి తగ్గి రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. రోగాల నుంచి కోలుకునే సమయం కూడా పెరిగిపోతుంది.

నిద్ర తక్కువైతే మెదడు కూడా క్రియారహితంగా నిస్తేజంగా మారుతుంది. ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే శక్తి తగ్గిపోతాయి. చివరకు రోజువారీ పనులు చేసేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

శరీరానికి తగినంత నిద్ర జ్ఞాపశక్తిపై ప్రభావం చూపిస్తుంది. అంతకుముందు రోజు నేర్చుకున్న విషయాలను మెదడు ఓ క్రమపద్ధతిలో క్రోడీకరించి నిక్షిప్తం చేసుకుంటుంది. నిద్ర తక్కువైన సందర్భాల్లో ఈ ప్రక్రియ కుంటుపడి మతిమరుపు వేధిస్తుంది.

Powernaps: రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!

శరీరంలో హార్మోన్ల సమతౌల్యానికి నిద్ర కీలకం. శరీరానికి తగినంత నిద్ర దొరకని సందర్భాల్లో జీర్ణక్రియలు, ఆకలిని నియంత్రించే హార్మోన్లు కట్టుతప్పుతాయి. ఫలితంగా అనవసరంగా ఆకలి పెరిగి చిరుతిళ్లకు అలవాటు పడతారు. అంతిమంగా ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.

నిద్ర తక్కువైన సందర్భాల్లో ఘ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరిగి లెఫ్టిన్ అనే హార్మో్న్ ఉత్పత్తి తగ్గుతుంది. ఘ్రెలిన్ కారణంగా ఆకలి పెరిగితే లెప్టిన్ కారణంగా కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. నిద్రలేమి కారణంగా వీటి మధ్య సమతౌల్యం దెబ్బతిని చివరకు ఊబకాయం బారిన పడారు.

మనకు తగినంత రెస్టు దొరికినప్పుడే చర్మం కూడా తనను తాను పూర్తిస్థాయిలో రిపేర్ చేసుకోగలుగుతుంది. నిద్రతక్కువైతే చర్మంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అకాల వార్ధక్య ఛాయలు వచ్చిపడతాయి.

వేళాపాళా లేని నిద్రకారణంగా బీపీ, గుండెపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది చివరకు హృద్రోగ సమస్యలకు దారి తీస్తుంది. నిద్రలేమి కారణంగా చికాకు కూడా పెరుగుతుంది. శారీరక సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది.

Immunity Boosters for Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఫుడ్స్ ఇవే

Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..

Read Latest and Health News

Subscribe for notification
Verified by MonsterInsights