Well being: రక్తపరీక్ష లేకుండా కాలేయం ఆరోగ్యం..తెలుసుకోవచ్చు ఇలా..

Written by RAJU

Published on:

మానవ శరీరం సక్రమంగా పనిచేసేలా చూడటంలో కాలేయంది కీలకపాత్ర. పొత్తికడుపులో ఉండే ఇది మన శరీరంలోనే అతిపెద్ద అవయవం. ముఖ్యంగా తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. దీంతో పాటు రక్తం నుంచి విషతుల్యాలను వేరుచేయడం, గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధీకరించడం సహా ఎన్నో శారీరక విధులు నిర్వహిస్తుంది. శరీరానికి అవసరమయ్యే రసాయనాలు తయారుచేస్తుంది కాబట్టే దీనిని అతిపెద్ద గ్రంథి అని అంటారు. అందుకే కాలేయాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం. మన ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే ఈ అవయాన్ని దురలవాట్లు, జీవనశైలిలో మార్పులు దెబ్బతీస్తున్నాయి. అయితే, పెద్దగా కష్టపడకుండానే కాలేయానికి రక్షించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి.

సాధారణంగా కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేస్తారు. కాలేయం పనితీరు బాగా లేని సమయంలో శరీరమే మనకు సంకేతాలు అందిస్తుంది. ఈ లక్షణాలను మీరు గుర్తించడం ద్వారా మీరు సకాలంలో చికిత్స చేసుకుని లివర్‌ని సంరక్షించుకోవచ్చు.

కాలేయ పనితీరు సరిగా లేదని తెలిపే 8 సంకేతాలు:

అలసట, బలహీనత:

ఎక్కవ కష్టపడకపోయినా పదే పదే అలసిపోయినట్లు, బలహీనత ఆవరించినట్లు అనిపిస్తే, అది కాలేయం దెబ్బతినింది అనడానికి సంకేతం.

చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం (కామెర్లు):

కాలేయం సరిగ్గా పనిచేయకపోతే బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి.

కడుపులో వాపు లేదా నొప్పి:

కాలేయంలో వాపు కారణంగా కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి లేదా భారంగా అనిపించవచ్చు.

కడుపులో గ్యాస్, అజీర్ణం, వాంతులు:

కాలేయం దెబ్బతింటే జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. అజీర్ణం, గ్యాస్‌, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం:

మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండా వేగంగా బరువు కోల్పోతుంటే , ఆకలిగా అనిపించకపోతే అది కాలేయ వైఫల్య లక్షణమే కావచ్చు.

చర్మంపై దురద లేదా దద్దుర్లు:

కాలేయం దెబ్బతినడం వల్ల శరీరంలో మురికి పేరుకుపోయి చర్మంపై దురదలు, దద్దుర్లు ఏర్పడతాయి.

పాదాలు, చీలమండలలో వాపు:

కాలేయ వ్యాధి కారణంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడవచ్చు. ఇది పాదాలు, చీలమండలలో వాపుకు దారితీస్తుంది.

మూత్రం రంగు:

కాలేయం సరిగ్గా పనిచేయకపోతే మూత్రం రంగు ముదురు పసుపు, ఇంకా మలం రంగు మారవచ్చు.

కాలేయ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు:

మన జీవితాన్ని నిలబెట్టడానికి అవసరయ్యే వందలాది విధులను నిర్వహించే లివర్‌ని కాపాడుకోవడం చాలా సులభం. తినే ఆహారంలో ఈ కింది పదార్థాలను భాగం చేసుకుంటే చాలు.

1. పీచు పదార్థాలు కాలేయ పనితీరును మెరుగుపరిచేందుకు చాలా సహాయపడతాయి. ఉదయాన్నే పొట్టు తీయని జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలు అల్పాహారంలో భాగం చేసుకుంటే మేలు. తాజా పండ్లు, కూరగాయలు, మెంతుల్లోనూ పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

2. బ్రకోలీ, బాదంపప్పు, పాలకూర, తోటకూర, మెంతికూర వంటివి డైట్‌లో భాగం చేసుకోవాలి.

3. ముఖ్యంగా మద్యం, నికోటిన్, శీతలపానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చక్కెర పరిమితంగా తీసుకుంటేనే మేలు. తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదుకు మించకుండా జాగ్రత్తపడాలి.

Subscribe for notification
Verified by MonsterInsights