Well being: ఈ ఫుడ్స్ తింటే త్వరగా వృద్ధాప్యం!

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: ప్యాకెట్లల్లో లభ్యమయ్యే చిరుతిళ్లు, కూల్ డ్రింక్స్ వంటి చక్కెర ఎక్కువగా ఉండే పానియాలు తరహా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ తింటే త్వరగా వృద్ధాప్యం వస్తుందని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. దీని వివరాలు అమెరికన్ జర్నల్‌ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి (Health).

Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!

శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, మనిషి పుట్టిన తేదీ నుంచి లెక్కించే వయసును క్రోనోలాజికల్ ఏజ్ అని అంటారు. ఇక శరీరంలోని కణాలు, కణజాలం వయసును బయాలాజికల్ ఏజ్‌గా పిలుస్తారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ అధికంగా తినే వారిలో బయాలాజికల్ ఏజ్ పెరుగుతోందని, వారి క్రోనోలాజికల్ వయసుకు మించిన వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇటలీలోని మధ్యవయస్కులు, వృద్ధుల ఆహారపు అలవాట్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం, తమ ఆహారంలో కనీసం 14 శాతం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్న వారిలో వాస్తవ వయసుకు మించిన వృద్ధాప్య ఛాయలు కనిపించాయట. పరిశ్రమల్లో వివిధ రకాల ఇండస్ట్రియల్ ప్రక్రియలతో పెద్ద ఎత్తున చేసే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో ఈ విపత్తు ముంచుకొస్తుందని తేల్చారు.

‘‘ఈ ఫుడ్స్‌లో సహజంగానే పోషక విలువలు తక్కువగా ఉంటాయి. చక్కెరలు, ఉప్పు, శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. దీనికి తోడు వీటిని వివిధ రకాల ఇండస్ట్రియల్ ప్రక్రియలకు గురి చేయడంతో వీటి ఆహారస్వభావం మారిపోతుంది. ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఈ అధ్యయనకర్తల్లో ఒకరు చెప్పుకొచ్చారు.

Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే

ఈ ఫుడ్స్ వల్ల జీవక్రియలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, మానసిక సమతౌల్యంపై కూడా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇదిచాలదనట్టు, ప్లాస్టిక్ పొట్లాల్లో నిల్వచేసిన కారణంగా ఇవి మరింత విషపూరితం అవుతాయని అన్నారు.

ఈ అధ్యయనంలో మొత్తం 22,500 మంది పాల్గొన్నారు. వారు తమ ఆహారపు అలవాట్లకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చారు. అంతేకాకుండా, వీరి బయాలాజికల్ ఏజ్‌ను అంచనా వేసేందుకు శరీరంలోని 36 బయోమార్కర్ల తీరుతెన్నులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. కాగా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన మరో అధ్యయనంలో.. అధిక చక్కెరల కారణంగా బయాలాజికల్ ఏజ్ పెరుగుతున్నట్టు తేలింది.

Read Latest and Health News

Subscribe for notification
Verified by MonsterInsights