ఇంటర్నెట్ డెస్క్: పది హేను రోజుల్లో 5 కేజీలు తగ్గడమంటే వినడానికి ఏదో సవాలుగా ఉన్నప్పటికీ ఇది కచ్చితంగా ఆచరణ సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు. కఠిన ఆహార నియమాలు, గంటలకు గంటలు జిమ్‌లో కసరత్తులు వంటివేవీ లేకుండానే బరువు తగ్గొచ్చు. సాధారణ జీవితంలో అనుసరించ దిగిన చిన్న చిన్న మార్పులతో ఇది సాధ్యమట. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
రోజు ఉదయం లేవగానే నిమ్మరసం, తేనె కలిపిన నీరు తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇందులోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి కొవ్వు మరింత వేగంగా కరిగిపోయేలా చేస్తాయి. ఇక తేనెతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతో పాటు తక్షణ శక్తి వస్తుంది. నిమ్మరసంతో బరువు కూడా సులువుగా తగ్గుతారు.
ఇక ఉదయం తీసుకునే అల్పాహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం కూడా బరువు తగ్గేందుకు అవసరం. ప్రొటీన్లు అధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌తో రోజంతా కడుపు నిండుగా అనిపించి ఆకలి తగ్గుతుందని అంటున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయట.
Feeling Extra Cold: చలి ఎక్కువగా వేస్తోందంటే ఈ సమస్య ఉన్నట్టే
బరువు తగ్గడంలో కసరత్తులదీ కీలక పాత్రే. రోజూ కనీసం గంట పాటు నడక, జాగింగ్ వంటివి చేస్తే కండరాలు బలోపేతం అవుతాయి. జీవక్రియలు వేగవంతమై బరువు తగ్గుతారు.
ఇక ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినడం కూడా బరువు తగ్గేందుకు అవసరం. కడుపు నిండుగా ఉన్నట్టు మెదడుకు సిగ్నల్స్ చేరేందుకు 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి హడావుడిగా తింటే ఎక్కువ ఆహారం శరీరంలో చేరుతుంది. ఇది అంతిమంగా కొవ్వు కింద మారి బరువు పెరుగుతారు.
చక్కెర ఎక్కువగా ఉన్న ఫ్రూట్ జ్యూస్‌లు, సోడాలు, ఇతర రకాల కాఫీలు తాగకపోవడమే మంచిది. పానీయాలతో కడుపు నిండుగా ఉన్న భావన కలగదని, ఫలితంగా కెలొరీలు అధికంగా ఒంట్లో చేరతాయని చెబుతున్నారు.
Cancer Risk: గుండె జబ్బులు ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుందా
బరువు నియంత్రణలో ఉండేందుకు కంటి నిండా నిద్ర కూడా అవసరమే. సరైన నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల మధ్య అసమతౌల్యం తలెత్తి అతిగా ఆహారం తింటారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు బాగా నీరు తాగాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో, కడుపు నిండుగా అనిపించి ఆకలి మందగిస్తుంది. అంతేకాకుండా, శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాన్నీ బయటకు పోతాయి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Read Latest and Health News