Weekly Horoscope | రాశి ఫలాలు ( 27.10.2024 నుంచి 2.11.2024 వరకు )

Written by RAJU

Published on:

గతవారం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. న్యాయవాద, వైద్య వృత్తులవారికి ఈ వారం కలిసివస్తుంది. అయితే పనిలో నిబద్ధత, మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. వాహనాల మూలంగా ఖర్చులు ఉంటాయి.


Weekly Horoscope | రాశి ఫలాలు ( 27.10.2024 నుంచి 2.11.2024 వరకు )

మేషం

గతవారం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. న్యాయవాద, వైద్య వృత్తులవారికి ఈ వారం కలిసివస్తుంది. అయితే పనిలో నిబద్ధత, మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. వాహనాల మూలంగా ఖర్చులు ఉంటాయి. స్నేహితులతో విభేదాలు రావొచ్చు. వారాంతంలో ఒక సమస్య నుంచి బయటపడతారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన శుభప్రదం.

వృషభం

ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్ని పనులూ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. రుణబాధలు తీరిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. గణపతిని ఆరాధించండి.

మిథునం

ఈ వారం అనుకూలంగా ఉంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. పాతబాకీలు నిదానంగా వసూలు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. రాబడి పెరుగుతుంది. కళాకారులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేపడుతారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి సమస్యలు ఉండొచ్చు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

కన్య

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పాతబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సంయమనంతో పనులు చేయడం అవసరం. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

తుల

పాత బాకీలు వసూలు అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం

ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు చేస్తారు. నూతన గృహనిర్మాణం చేపడతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తోటివారితో అభిప్రాయభేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి.

ధనుస్సు

అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రాదుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్యం మందకొడిగా ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

మకరం

కళాకారులకు మంచికాలం. పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం

గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యం కారణంగా ఖర్చులు పెరగవచ్చు. శివ స్తోత్రాలు పఠించండి.

మీనం

ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Subscribe for notification
Verified by MonsterInsights