Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు

Written by RAJU

Published on:

Weekly Horoscope | ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.


Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు..  ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు

మేషం

ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్నచిన్న విషయాలకే హైరానా పడుతుంటారు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వారం మధ్యలో మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. మాతృవర్గం సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. బహుమతులు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

వృషభం

శారీరక సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టనివారితో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వారి వల్ల వృథా ఖర్చులు ముందుకురావచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.

మిథునం

తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. ఆగ్రహావేశాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. విదేశీయాన ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వైష్ణవాలయ దర్శనం మేలుచేస్తుంది.

కర్కాటకం

ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాలయాపనకు చోటివ్వకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

కన్య

ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. దక్షిణామూర్తి ఆరాధన మేలుచేస్తుంది.

తుల

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. నిత్యం హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం

ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయుల సూచనలు అమలుచేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వారాంతంలో శుభవార్త వింటారు. శివారాధన వల్ల శుభ ఫలితాలు అధికమవుతాయి.

ధనుస్సు

తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అన్నదమ్ములతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.

మకరం

ఈ వారం సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. సమయపాలన అవసరం. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సూర్యుడి ఆరాధన మేలుచేస్తుంది.

మీనం

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు పోవద్దు. పెద్దల సూచనలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Subscribe for notification
Verified by MonsterInsights